Rs.70.00
In Stock
-
+
వరం శాపం అయిన జీవితంలో
ఆలోచన అనివార్య యాతన
సాహిత్యం జీవితాన్ని ఉన్నతీకరిస్తుంది; విమర్శ సాహిత్యాన్ని ఉన్నతీకరిస్తుంది. ఈ తెలివిడితో కొనసాగిన అధ్యయనక్రమంలో కొన్ని విమర్శవ్యాసాలు రాశాను. నా అభిరుచిని, అవగాహనను తెలిపే ఈ వ్యాసాలు విభిన్న ప్రక్రియలను పరామర్శిస్తాయి. ఇవి కేవలం సాహిత్యావరణకే పరిమితం కావు. సాహిత్యానుశీలన కవసరమైన తాత్వికాంశాల దాకా విస్తరిస్తాయి. తాత్వికత విమర్శను ఉన్నతీకరిస్తుంది. మార్క్సిజం, ఆస్తిత్వవాదం, బౌద్ధం, ఎరిక్ ఫ్రామ్ సామాజికవిశ్లేషణ నా విమర్శవ్యాసాల మూలధాతువులు. ఆపైన నా వివేచన నాది. క్రిటిసిజమ్ ఈజ్ ది డిస్కవరీ ఆఫ్ ట్రూత్.
Pages : 140