జీవితం పట్ల ప్రేమనీ, సంక్షోభానికి గురవుతున్న మనిషి మనుగడ పట్ల ఆర్తినీ, మానవీయ సంవేదనల పట్ల అనుకంపననీ, మంది శ్రేయస్సు పట్ల నిబద్ధతని పెంపొందించేవీ - పెరిగి పోతున్న మానవ దురాల్ని తుడిచేసి మనుషుల మధ్య సౌహార్ద భావననీ, సౌభ్రాత్రాన్నీ నింపగలిగేవీ - జీవితాన్ని సార్థకం చేయగల వుదాత్తమైన సంస్కారాన్ని అందించేవీ - హృదయాన్ని తాకి లోపలి సున్నితత్వాల్ని తట్టిలేపేవీ - మానవావరణంలో వెల్లి విరియాల్సిన ప్రేమ కరుణ వంటి సార్వకాలీన విలువల్ని ప్రతిపాదించేవీ మంచి కథలు అనుకొన్నప్పుడు అటువంటి మంచి కథల్ని శివశంకర్‌ రచనలనుంచి ఎంపిక చేసి కథాస్రవంతి ద్వారా ఈ తరం కోసం అందిస్తున్నందుకు చాలా సంతోషంగా వుంది. ఇవి పాపినేని సాహిత్య వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే ప్రాతినిధ్య కథలని నా నమ్మకం. - ఎ.కె.ప్రభాకర్‌

Pages : 113

Write a review

Note: HTML is not translated!
Bad           Good