తెలుగునాట నవలల్ని విశేషంగా చదివింపచేసే అలవాటు చేసిన రచయితల్లో మాదిరెడ్డి సులోచన ఒకరు. ఆనాడు కాల్పనిక ప్రభావంతో రచనలు చేసిన వారిలో ఈమె ఒకరు. ఊహాజనిత చిత్రణ కంటే వాస్తవిక జీవిత చిత్రణకు ప్రయత్నించారు.

పంతులమ్మ :

బస్సుదిగి స్కూలు వైపు దృష్టి సారించింది సుచరిత. పిల్లలూ, ఉపాధ్యాయులూ ప్రార్థన ముగించి తరగతులలోకి వెళ్తున్నారు. మనసంతా అదోలా అయింది. తొమ్మిది కాకముందే యింటివద్ద బయలుదేరి, లేటు మార్కువేయించుకోవాలంటే సిగ్గుగా వుంది. త్వరత్వరగా వెళ్ళి అటెండెన్సు రిజిష్టరులో సంతకము చేసి తరగతికి వెళ్ళిపోయింది. పాఠశాలంతా కలయతిరుగుతూ ప్రధానోపాధ్యాయులు కనిపించారు. ఆయనకు విష్‌ చేసే ధైర్యము లేకపోయింది. ఉపాధ్యాయులందరూ ప్రార్థన వేళకు విధిగా వుండాలంటారాయన. కాని తనే చేయగలదు? రాజధానిలో బస్సుల ప్రయాణం గురించి రాస్తే ఓ భారతం అవుతుంది. ఒక రోజు బిఫోర్‌ టైమంటూ మధ్య దార్లో ఆపుతారు. ఇంకో రోజు స్టాపుకు దూరంగా తీసుకుపోయి ఆపుతారు. ఇవి రెండూ లేనినాడు బస్సు దానంతటదే ఫేలవుతుంది. కండక్లర్లకు డబ్బులిచ్చి టికెట్‌ అడగ్గూడదు. అడిగితే ఆ మనిషి స్టేజి దగ్గర కనిపిస్తే చాలు బస్సును ఆపరు. అందరూ అలాగే ఉంటారని కాదు....

పేజీలు : 151

Write a review

Note: HTML is not translated!
Bad           Good