జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, సాహిత్యకారులు తప్పక చదవాల్సిన పుస్తకం 'పనికొచ్చే ముక్క'.

'విశాలాంధ్ర'లో వెలువడిన రాజకీయ, సామాజిక, సాహిత్య వ్యాసాల మాలిక ''పనికొచ్చే ముక్క''.

జ్ఞానమే శక్తి అన్నాడు ఫ్రాన్సిస్‌ బేకన్‌. అన్ని రకాల జ్ఞానానికి సంబంధించీ యిది నిజం కాదనీ, శక్తిదాయకమైన జ్ఞానం ఉపయోగకరంగా వుంటుందనీ బెట్రాండ్‌ రస్సెల్‌ రాశాడు. ఆయన యూజ్‌లెస్‌ నాలెడ్జ్‌ అని ఒక వ్యాసం రాశాడు. పనికిమాలిన జ్ఞానం ఏమిటైందీ యివాల్టి టీ.వీ.లకి అతుక్కుపోయి చూసేవాళ్ళని తడితే తెలుస్తుంది. ''కన్యాశుల్కంలో శిష్యుడు పాఠం చదువుతూ 'పనికొచ్చే ముక్క ఒక్కటీ యీ పుస్తకంలో లేదు' అని భావిస్తాడు. చదువెందుకు పొట్ట పోషించుకోడానిగ్గదా?' అని గురువు కరటక శాస్త్రి ముక్తాయిస్తాడు. అంతమాత్రం చేత మరీ ప్రాపంచికమైనవే పనికొచ్చేవని కాదు. కళలకీ, సంస్కృతికీ విలువ లేదనీ కాదు. జీవితాన్ని మెరుగుపరచలేని విద్య పనికిరాదని మాత్రమే అర్థం. నేల విడిచి సాము చేసే కళలూ, సంస్కృతీ యీ కోవ కిందికే వస్తాయి. ఆధునిక జ్ఞానంవల్ల జీవితం ఎంత మెరుగుపడిందో, దాని బొరుసు భాగంవల్ల అంతే ప్రమాదకరంగానూ వుంది. అణుశక్తే దీనికి ఉదాహరణ. అంచేత 'పనికొచ్చే ముక్క'నే గ్రహించి వృద్ధి చేసుకోవాలి.

అందరూ కష్టాలని దాటి పోవాలి. అందరూ భద్రమైన వాటినే పొందాలి. అందరికీ సద్భుద్ధులే కలగాలి. సర్వులూ, సర్వత్రా ఆనందమే పొందాలి

అన్నకోరిక సాకారం అయేందుకు నడిపించేటట్టు చేసే జ్ఞానమే అసలైన జ్ఞానం.

Pages : 87

Write a review

Note: HTML is not translated!
Bad           Good