పేదరాశి పెద్దమ్మ కథలు ప్రారంభం

రామాపురం అనే గ్రామంలో ఒక ముసలవ్వ నివసిస్తూ ఉండేది. ఆమెకు 60 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆమె ముఖంమీద ముడతలు ఉన్నా చూడటానికి చాలా అందంగా ఉంటుంది. కొన్ని పళ్ళు ఊడిపోయిన బోసినోటితో నవ్వుతూ ఉంటే చాల అందంగా ఉండేది. తలమీద ఉన్న వెంట్రుకలు అన్నీ తెల్లబడి ఉండేవి. ఆవిడకి ఊరి మధ్యలో ఒక పెంకుటిల్లు ఉండేది. ఆ ఇంట్లో అన్ని రకాల పూల మొక్కలు, పండ్ల మొక్కలు అన్ని రకాల మొక్కలను పెంచుతూ ఉండేది. ఒక ఆవు, దూడ కూడా ఉండేవి. ఆ ఇంట్లో రాము, సోము అనే ఇద్దరు పనివాళ్లు ఉండువారు. వంగిపోయిన నడుముకు ఊతంగా చేతికర్ర పట్టుకుని దాని సాయంతో నడుస్తూ వారితో పని చేయిస్తూ దర్జాగా తిరుగుతూ ఉండేది. ఆ ఊరిలో ఉన్న వారందరికి అవ్వ అంటే అభిమానం. ఎవరైనా ఎండవేళ ఆమె ఇంటికి వస్తే చల్లని మజ్జిగ ఇచ్చి వారి దాహం తీర్చేది. భోజనాలవేళ ఆమె ఇంటి తలుపు తడితే విస్తరివేసి భోజనం చేసిన తరువాత కానీ పంపేదికాదు. సాయంత్రం పూట వీధిలో అరుగుమీద కూర్చుని వచ్చేపోయే వారిని ఆప్యాయంగా పలుకరిస్తూ ఉండేది. వారు కూడా ఎంతో వినయంగా మెకు నమస్కరిస్తూ వెళుతూ ఉండేవారు. ఇన్ని ఉన్న అవ్వకు పిల్లలు లేకపోవడం ఆమెను కొంచెం బాధిస్తూ ఉండేది. ఊరిలో ఏ శుభకార్యం అయినా వూరిలోని వాళ్ళు ముందు ఆమె ఇంటికి వచ్చి ఆమె ఆశీర్వాదం తీసుకుని వెళుతూ ఉండేవారు.

వేరే గ్రామం నుండి ఎవరైనా అర్థరాత్రి అయినా వచ్చి తలుపు తడితే వారిని సాధరంగా ఆహ్వానించి వారికి అప్పటికప్పుడు వంటలు చేయించి పెట్టేది. అందుకే ఆమె అంటే అందరికీ గౌరవం అభిమానం.

ఇక ఆ ఊరిలోని పిల్లలకు ఆమె అంటే విపరీతమైన అభిమానం, సాయంత్రం అయిందంటే అందరూ గుంపుగా ఆమె ఇంటికి వెళ్ళేవారు. ఆమె వారితో ఆటలు ఆడించేది. రకరకాల పాటలు నేర్పించేది. రామూ, సోమూతో రోజుకో రకం పండు కోయించి వారికి పంచి అనందిస్తూ ఉండేది.

తరువాత అందరూ జామచెట్టుకింద కూర్చుని అవ్వచెప్పే నీతికథలు, సాహసకథలు వింటూ ఉండేవారు. రోజుకు ఒక కథను ఆమె చెప్తూ ఉండేది. దానిలో నీతిని వారికి చెపుతూ ఉండేది.

అలా ఏర్చి కూర్చిన ఈ కథల సమాహారమే ఈ పేదరాశి పెద్దమ్మ కథలు....

పేజీలు : 295

Write a review

Note: HTML is not translated!
Bad           Good