గురువు - పిల్లి - కిశోరన్యాయం

పెద్దాపురం అనే గ్రామంలో ప్రశాంత్‌ అనే కుర్రవాడు ఉండేవాడు. అతడు రోజు స్కూల్‌కి వెళ్ళేదారిలో వెళుతుండగా ఒక పిల్లి తన పిల్లలను నోటకరచుకుని వెళ్ళడం చూచి చాలా బాధపడ్డాడు.

పిల్లి తన పిల్లలను నిర్ధాక్షిణ్యంగా అలా నోట కరవడం వలన తల్లికి బాధ అనిపించదా అని మనసులో అనుకున్నాడు. మరికొన్ని రోజుల తరువాత తన వీధి గుమ్మంలో కూర్చుని చదువుకుంటున్నాడు. ఆ సమయంలో ఇంటి ముందు ఒక చెట్టుపైకి ఒక కోతి తన పిల్లను తన కడుపులో దాచుకొని చెట్టు ఎక్కుతున్నది. కోతిపిల్ల తన తల్లి పొట్టను విడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకుని ఉంది. ఆ దృశ్యం చాలా తమాషాగా అనిపించింది ప్రశాంత్‌కి.

ఆ మరుసటి రోజు నుంచి తనుకూడా తల్లిదండ్రులు గమనించకుండా తన పుస్తకాల బ్యాగును కడుపుమీద పెట్టుకొని చెట్టుఎక్కడం ప్రారంభించాడు. ఒకరోజు ప్రశాంత్‌ తండ్రి తన కొడుకు పుస్తకాల బ్యాగు కడుపున పెట్టుకొని చెట్టు ఎక్కడం గమనించి బాగా మందలించాడు. అలా చేస్తే కాళ్ళు, చేతులు విరిగిపోతాయి ఏమిటా పని అని కోపగించుకోగా ప్రశాంత్‌ ఏడ్చుకుంటా కూర్చున్నాడు.

ఒకరోజు తన ఉపాధ్యాయుడు పాఠం చెబుతూ పిల్లలు బుద్ధిగా చదువుకోవాలి. అని చెబుతూ కొన్ని కథలు ఉదాహరణగా చెప్పారు.

పేజీలు : 308

Write a review

Note: HTML is not translated!
Bad           Good