మరే పుస్తకంలో లేని 5 తంత్రాలలోని 50 నీతి కథల మాలిక! బాల్యంలోనే మంచి నడవడి, నీతి అలవడేందుకు, లోకజ్ఞానం కలిగేందుకు పిల్లలో తప్పక చదివించాల్సిన నీతి కథలు ఈ 'పంచతంత్ర కథలు'. పూర్వం గంగానదీ తీరానగల పాటలీపుత్రం అనే పట్టణాన్ని సుదర్శనుడు పరిపాలించేంవాడు. అతనికి ముగ్గురు కుమారులు. ఆ ముగ్గురికీ చదువుమీద శ్రద్ధ లేదు. ఎప్పుడూ ఆటపాటలతోనే కాలం గడుపుతూ మూర్ఖులై పోయారు. కొడుకులు ఇలా కావడం సుదర్శనుడికి ఎంతో బాధ కలిగించింది. ''మూర్ఖులైన పిల్లలు తల్లిదండ్రులకు కలకాలం దు:ఖాన్ని కలిగిస్తారు. మనిషికి విద్య అనేది దాచుకునన సంపద. విద్యవల్ల కీర్తి, సుఖశాంతులు కలుగుతాయి. కానీ నా కుమారులకు తగిన విద్య నేర్పక మూర్ఖులయ్యారు. ఈ తప్పు నాదే!'' అనుకున్నాడు సుదర్శనుడు. సుదర్శనుడు ఆ తర్వాత విష్ణుశర్మ అనే పండితుణ్ణి పిలిపించాడు. ''పండితవర్యా! నా కుమారులు విద్య నేర్వక మూర్ఖులుగా తయారయ్యారు. వారికి విద్యాబుద్ధులు నేర్పాలి. మంచి నడవడి, లోకజ్ఞానం కలవారిగా తీర్చిదిద్దాలి. అలా చేయగలరా?'' అని ప్రశ్నించాడు సుదర్శనుడు. ''మహారాజా! అదెంత పని? తమ కుమారులను నీతిమంతులుగా చేయడం కష్టం కాదు. రత్నం ఎంత గొప్పదైనా సానపెట్టకుండా ప్రకాశించదు. బాలుడెలాంటివాడైనా తగిన శిక్షణ లేకపోతే రాణించడు. కనుక నేను ఆరు నెలల్లో తమ కుమారులకు తగిన విద్యాబుద్ధులు నేర్పి మీకు అప్పగిస్తాను.'' అన్నాడు విష్ణుశర్మ. విష్ణుశర్మ మాటలు విని సుదర్శనుడు ఎంతో సంతోషించాడు. తన కుమారులను విష్ణుశర్మకు అప్పగించాడు. విష్ణుశర్మ ముగ్గురు రాకుమారులను తన ఇంటికి తీసుకువెళ్ళాడు. చల్లని చెట్లనీడలో కూరోకచబెట్టాడు. అయితే వాళ్ళను అక్షరాలు రాయమనలేదు. శ్లోకాలు వల్లించమనలేదు. చక్కని కథలు చెప్పాడు. ఆ కథలే పంచతంత్రం కథలుగా ప్రసిద్ధి చెందాయి. ఆ కథలు విని ఆ రాజకుమారులు మంచి ప్రవర్తనను అలవరచుకున్నారు. ఆ కథలేమిటో చదువుదామా....!
Rs.150.00
Out Of Stock
-
+