విష్ణుశర్మ పాటలీపుత్ర రాజైన సుదర్శనుడు యొక్క ముగ్గురు కుమారులను తన ఆశ్రమానికి తీసుకొని పోయి వారికి పక్షులు, జంతువుల పాత్రలతో కలిగియున్న నీతివంతమైన కథలను వినిపించాడు. ఈ కథలే 'పంచతంత్రము' అను పేర ప్రసిద్ధి గాంచాయి.

'పంచ' అటే ఐదు. విష్ణుశర్మ రాకుమారులకు వినిపించిన నీతికథావళి ఐదు భాగములుగా వున్నాయి. అవి మిత్రలాభం, మిత్రభేదం, సంధి, నిగ్రహం, అపరీక్షిత కారత్వం.

మిత్రలాభం : మంచి మిత్రులను కలిగి వుండడం ఎంతటి ప్రయోజనాన్ని కలిగిస్తుందో తెలుపుతుంది.

మిత్రబేధం : మిత్రులమధ్య తగువులు పెట్టి వారిలో వారే కలహించుకొని నాశనం కాబడటం ద్వారా శత్రువు ఏ విధంగా లాభం పొదుతాడో తెలుపుతుంది.

సంధి : ఆవేశపడి యుద్ధాలకు సిద్ధమయితే ఎలాంటి నష్టాలు వుంటాయో, అలా కాక సంధి చేసుకొనుట ద్వారా ఏ విధంగా ప్రయోజనం వుంటుందో తెలుస్తుంది.

లబ్దప్రణాశం : తెలివితక్కువతనం వల్ల ఏం జరుగుతుందో తెలుపుతుంది.

అపరీక్షిత కారత్వం : వెనుకముందు ఆలోచించకుండా పనులు చేయడం ద్వారా ఎలాంటి నష్టాలు కలుగుతాయో తెలుస్తుంది.

పైన చెప్పిన ఐదు భాగాలలోనే పంచతంత్రంలోని కథలన్నీ వస్తాయి.

Pages : 160

Write a review

Note: HTML is not translated!
Bad           Good