విష్ణు శర్మ చెప్పిన పంచతంత్ర కథలు తరతరాలుగా వస్తున్నాయి. పురాణాలూ, ఇతిహాసాల తర్వాత ఇంతగా ప్రాచుర్యం పొందిన కథలు మరొకటి లేవు. గుణాధ్యుడు రాసిన బృహత్కథలోని కొన్ని కథలే విషు శర్మ పంచతంత్రానికి ఆధారం. ఈ కథల్ని విషు శర్మ ఐదో శతాబ్దంలో  రాచించాడు. ఇవి మిత్రలాభం, మిత్ర భేదం, కాకోలు కీయం, లబ్ధప్రణాశం అపరీక్షిత కారకం అని అయిదు భాగాలుగా ప్రసిద్ది చెందాయి. పంచత్రంత్ర కదల ఆధారంగా 14 వ శతద్భంలో మిత్రలాభం, మిత్ర బేధం, సంధి, విగ్రహం అని నాలుగు భాగాలు ఉన్నాయి. హితోపదేశంలోని మిత్రలాభం, మిత్రభేదాలను పరవస్తు చిన్నయసూరి తెలుగు లో అనువదిస్తే, సంధి, విగ్రహాలను కందుకూరి వీరేశలింగం అనువదించారు. ఈ నాలుగింటిని కలిపి నీటి చంద్రిక అని వ్యవహరిస్తున్నారు. అయిదు భాగాలుగా ఉన్న పంచతంత్ర అన్నా నాలుగే భాగాలు ఉన్న హితోపదేశం అన్నా రెండూ ఒక్కటే | అయినా ఈ రెంటినీ కలిపి , సమగ్రంగా సరళ వ్యావహారికలలో పాఠకుల కోరిక మేరకు ఆయాల సోమయాజుల నీలకంటేశ్వర జగన్నాధశర్మ , వారం వారం నవ్యవీక్లి లో రావడం జరిగింది. ఆ కదలనే ఎప్పుడి పుస్తకంగా వెలువరిస్తున్నాం. ఈ కథలు పిల్లలకు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. కథలలో పాత్రలు జంతువులు కావడం, జంతువులు మనుషుల్లా మాట్లాడుకోవడం, ప్రతి కథకూ నీటి ఉన్న కారణంగా ఈ కథల్ని పిల్లలు తప్పనిసరిగా చదివి తీరాలి. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good