గర్భం దాల్చడం, గర్భస్థకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రసవం, పాపాయి సంరక్షణ వంటి అనేక విషయాలను చర్చిస్తుంది ఈ గ్రంథం. ఆధునిక ఫిజిషియన్‌, రచయిత, హెల్త్‌ కాలమిస్ట్‌ డాక్టర్‌ యతీష్‌ అగర్వాల్‌, రచయిత, జీవశాస్త్రవేత్త రేఖా అగర్వాల్‌ చాలా సులువైన భాషలో ఎంతో ఉపయుక్తమైన అనేక విషయాలను ఇందులో వివరించారు. ఈ పుస్తకంలో ప్రస్తావించిన అంశాలన్నీ కూడా చాలామంది కొత్తగా తల్లులవుతున్న మహిళల, వారి పెద్దవాళ్ళ మనసులో ఎప్పటినుంచో అనుమానాలుగా ఉన్న విషయాలే. ప్రతిసారీ ప్రసూతి నిపుణులను అడగాలని అనుకునే అంశాలనే ఇక్కడ చర్చించడం జరిగింది. గర్భధారణ, కడుపుతో ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తీసుకోవాల్సిన ఆహారం, వ్యాయామాలు, పరీక్షలు, సాధారణ సమస్యలు, ప్రసవం, ప్రసవానంతర జాగ్రత్తలు, పాపాయి సంరక్షణ వంటి అనేక విషయాలను వివరించడం జరిగింది. తల్లి కావాలనుకుంటున్న ప్రతి ఆధునిక మహిళ, అలాగే నాన్నమ్మ, అమ్మమ్మ కావాలనుకుంటున్న ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good