శారదానర్తనమందిరం - అన్నమయ్య గ్రంథాలయం

ఊహించండి! ఒక మధ్య తరగతి మనిషి, వెనుక పెద్దగా ఆస్తిపాస్తులు లేనివాడు, కుటుంబభారం, చుట్టాలసురభి, ఓ మాదిరి ఉద్యోగం - వీటితో యాభైఏళ్ళలో ఎన్నిపుస్తకాలు సేకరించగలడు. ఉన్న ఊళ్లోనే సేకరణ, పోస్ట్‌ ద్వారా తెప్పించలేదు. ఒక్క పుస్తకం కూడా అన్యాక్రాంతంగా సంపాదించలేదు. ఒక్క పత్రికకు చందా కట్టలేదు. మీ ఊహలు ఏమోగానీ నా సమాధానం 70 వేల పుస్తకాలు అని. ఆ మనిషి సేకరించిన గ్రంథాలయం పేరే అన్నమయ్య గ్రంథాలయం.

యామిని కృష్ణమూర్తి గురించి రాసిన చక్కని వ్యాసం, దానిపై తెలుగులో ఆవిడ ఆటోగ్రాఫ్‌; ఏ.ఎస్‌.రామన్‌ ఇష్టంగా  చిత్రకళపై వ్రాసిన వ్యాసాలన్నీ కలిపికుట్టిన బౌండ్‌, దానిపై ఆయన సంతకం; ఎప్పుడో 1895లో పమ్మి త్యాగరాయ శెట్టి ముద్రించిన సారంగపాణి పదాలు; హిమజ్వాల ప్రచురణ అయ్యేటప్పుడు దానిపై వచ్చిన విమర్శ; ప్రతివిమర్శలన్నీ కలిపి కుట్టిన సంకలనం; ఇప్పుడు ప్రచారంలో ఉన్న చిన్నయసూరి చిత్రం ఆయనది కాదని రాస్తూ, సూరి చేవ్రాలు కూడా ఇచ్చిన బూదరాజు రాధాకృష్ణగారి వ్యాసం; ధారావాహికగా వచ్చిన హారీతి శివశర్మగారి హరివంశం వచనానువాదం; ఇవన్నీ మనం ఎక్కడ చూడవచ్చు - అన్నమయ్య గ్రంథాలయంలో. ఇంత గ్రంథసంచయాన్ని ఎలాంటి ఉద్దేశ్యం లేకుండా - నిరపేక్షంగా - కేవలం ఆత్మ సంతృప్తి కోసమే సేకరించి కొన్నాళ్ళ క్రితం లోకానికి ఇచ్చింది సూర్యనారాయణగారనే పెద్దమనిషి. - మోదుగుల రవికృష్ణ

పేజీలు : 240

Write a review

Note: HTML is not translated!
Bad           Good