సుబ్బదాసు జీవత రేఖలు

దుర్గి, ధర్మవరం పలనాట ప్రక్కప్రక్కనే నెలకొన్న గ్రామాలు. దుర్గిలోని వేణుగోపాలుడు ప్రసిద్ధ దైవం. చిరుమామిళ్ళ శేషయ్యగారిది ధర్మవరం. శేషయ్యగారికి నరసయ్య, వెంకయ్య, కృష్ణయ్య అని ముగ్గురు కుమారులు. ఆ నరసయ్య, అంబమాంబ గార్ల కుమారుడే మన సుబ్బదాసు. ఈయనకు తల్లిదండ్రులు పెట్టినపేరు సుబ్రహ్మణ్యం.

సుబ్బదాసు జననం : తిరుమల రామచంద్రగారు తమ స్వీయచరిత్ర ''హంపీనుంచి హరప్పదాకా'' లో వ్రాసుకున్న జనన విషయం సుబ్బదాసుగారి జననాని అతికినట్లు సరిపోతుంది.

పలనాటి చరిత్ర

అలనాటి నుండి పలనాడు పౌరుషానికి పెట్టింది పేరు. అది వీరభూమి. అన్ని రాజ్యాలలో మాదిరిగా అక్కడకూడ రాజ్యం వీరభోజ్యం. శైవం, వైష్నవాల పేరుతో ఒకరిపై ఒకరు కత్తులు దూసుకున్న ప్రాంతం పలనాడు. ''వీరరక్తపుధార వారువోసిన సీమ'' పలనాటి సీమ. గంగధారమడుగు ప్రస్తుతం ఉలకకుండా, పలకకుండా ఉండి పోవచ్చునుగాని నాగులేరు సాక్షిగ అది రక్తపుటేరులు పారిన ప్రాంతం. అందుకే ఆచార్య ధనకుధరం యిలా అంటారు:

''శైవవైష్ణవాల సమరాన తెగబడ్డ

వీరరక్తధార చూరగ్రోలి

గంగాధరమడుగు నంగనాచివోలె

ఉలుకు పలుకు లేక యున్నదిపుడు''

కారెంపూడి కదనం పలనాటి వీరుల పౌరుషానికి ప్రత్యక్ష సాక్ష్యం. పలనాటి యుద్ధాన్ని కవిరాజు త్రిపురనేని రామస్వామిగారు కలియుగ భారతయుద్ధంగా పేర్కొంటారు. రెండింటిమధ్య పోలికల్ని వారి 'భగవద్డీత'లో కన్నులకు కట్టిస్తారు. మనసుకు పట్టిస్తారు. వీరారాధన పలనాటి ప్రజల బ్రతుకుల్లో భాగమయ్యింది. ధర్మవీరము, ఆధ్యాత్మిక వీరత్వము పడుగుపేకల్లా కలగలిసిపోయాయి.

పేజీలు : 64

Write a review

Note: HTML is not translated!
Bad           Good