ఇప్పుడు మనం చదివే మహా గాధలన్నిటికీ ప్రారంభం ఈకథలే. కల్పనను ప్రయోగించటానికి మానవుడు ఎంచుకున్న ప్రాచీన హరివిల్లులు. మనిషి శరీరానికి ఆక్సిజన్ ఎంత అవసరమో కల్పన అంత అవసరం. జానపదుల సంతోష దుఖ విస్మయ అన్వేషణలు ఈ కథలు.  అనుభవం నుంచి నేరుగా జారిన శబ్ధగాథలు. అందుకే ఇవి ఏకాలంలోనైనా, ఏమట్టిలొనైనా మొలకెత్తుతాయి. ఏవయసుతోనైనా చెలిమిచేసి, భుజం పైచేయి వేస్తాయి. ఈ ప్రపంచ జానపద కథల్ని చదువుతుంటే మరచిపోయిన దేశంలోకి కొత్తగా అడుగు పెట్టడమే. మరోస్వర్గలోకపు ద్వారాలను తెరవటమే!--- రమణజీవి

Write a review

Note: HTML is not translated!
Bad           Good