భారత జ్ఞానపీఠమెక్కిన తొలి తెలుగు నవల 'పాకుడురాళ్ళు'

'పాకుడురాళ్ళు' ఒక నవలగా నాకు నచ్చడానికి కారణం, సినిమా వెనుక గల సినిమా చరిత్రను, రచయిత కథాత్మకంగా చిత్రించడమే కాదు; జరిగిన, జరుగుతున్న, జరగడానికి అవకాశాలున్న వేలాది సంఘటనలను మనోజ్ఞంగా తన రచనలో పోహళించడం కూడా కాదు; వీటన్నింటినిమించి, వీటన్నింటి వెనుకా, రచయిత పడుతున్న మనోవేదన, వాటిని మార్చి తీరాలన్న అతని ప్రగాఢవాంఛ నన్ను కదిలించింది. నిత్యకళ్యాణం పచ్చతోరణంగా భాసిస్తూ, వేలాదిమందిని తనవైపుకు ఆకర్షించే ఈ రంగంలో, పాతుకుపోయిన అవాంఛనీయమైన శక్తులను గురించి రచయచిత మనకు కనువిప్పు కలిగిస్తున్నాడు. చిరునవ్వుల వెనుక మణిగిపోయే ఆత్మఘోష, తళుకు చూపుల చాటున దాగిన కన్నీరు, తియ్యని మాటల మాటున పొంచున్న విషజ్వాలలు, మనకి ఈ నవలలో ప్రత్యక్షమౌతాయి.

Pages : 613

Write a review

Note: HTML is not translated!
Bad           Good