ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలలలో బోధించబడుతున్న విషయాలు గానీ, విధానాలు గానీ బాలలకు చాలా హానికరమైనవిగా వున్నాయి. విద్యార్హతను పరీక్షలతోనూ, బహుమతులతోనూ, పోటీలతోనూ, కుస్తీ పట్లతోనూ కొలుస్తున్నారు. ఈ రకపు చదువు సంధ్యల ఫలితాలే ఈర్ష్య, ద్వేషం, దెబ్బలాటలు, అశాంతి, అసంతృప్తి, అదుపు తప్పటం, పరిస్థితి అస్థవ్యస్థంగా మారిపోవటం.

ఈ విధానానికి స్వస్తి పలకాలని, ఓ నూతన విధానం కావాలని గిజుభాయి ఎన్నో ప్రయోగాలు చేశారు. సత్ఫలితాలు పొందారు. ప్రాధమిక విద్యారంగంలో మౌలికమైన మార్పులెన్నో ప్రవేశపెట్టారు. తాను ఆచరించి రుజువు చేశారు. ఆయన స్వయంగా తన పద్ధతుల్లో దాదాపు ఆరు వందల మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి విద్యా కార్యకర్తలను రూపొందించారు. ఓ నూతన మార్గం చూపించారు.

కేవలం ఉద్యోగం, జీతం అనే పరిమిత స్ధాయిలో జడంగా బతికేసే ఉపాధ్యాయులను కాకుండా ఆదర్శంగా - ప్రేరణ నిచ్చే వ్యక్తిత్వంతో - ధైర్యంతో ఒక ఆశయం కోసం జీవించే ''భావి ఉపాధ్యాయుల'' నిర్మాణం గిజుభాయి ''పగటి కల''.

Write a review

Note: HTML is not translated!
Bad           Good