కార్టూన్లలో పొలిటికల్‌ కార్టూన్లకొక సౌలభ్యం ఉంది. అనుక్షణం మలుపులు తిరిగే రాజకీయ పరిణామాలు వాటికి సరిపడినంత సమాచారాన్ని అందిస్తాయి. కాని, సోషల్‌ కార్టూన్లు అలా కాదు. మానవ సంబంధాలు, స్వభావాలు అనుక్షణం అధ్యయనం చేస్తూ వుండాలి. సమాజంలో మార్పులు సునిశిత దృష్టితో గమనిస్తూ ఉండాలి.

ఒకావిడ పక్కావిడతో ఫ్యానుకి ఉరిపోసుకున్న కుర్రాణ్ణి ఉద్దేశించి అంటుంది, 'కంప్యూటర్‌ హ్యాంగ్‌ అయిందని తాను హ్యాంగ్‌ చేసేసుకున్నాడు. ఈ రోజుల్లో కుర్రాళ్ళకి క్షణికావేశం ఎక్కువైపోయిందమ్మా' అని! 'అబ్బబ్బ... పిల్లలముందు ఇలా అరుచుకోకూడదన్న ఇంగితజ్ఞానం కూడా లేదా మీ ఇద్దరికీ?' నిలదీస్తాడొక ఆరింద కుర్రాడు ఘర్షణపడుతున్న అమ్మానాన్నల్ని! 'ఈ వాషింగ్‌ మెషీను బట్టలు ఉతకడానికేనమ్మా... మీ ఆయన్ని కాదు!' అంటాడో సేల్స్‌మెన్‌! వైవిధ్యమైన విషయాల్ని ఎన్నుకోవడం కార్టూనిస్టు విజ్ఞతకు అద్దం పడుతుంది. అయితే, కార్టూన్‌కి ఐడియా ఎంత ముఖ్యమో బొమ్మ కూడా అంతే ముఖ్యం!...- ఎమ్మెస్‌ రామకృష్ణ

పేజీలు :144

Write a review

Note: HTML is not translated!
Bad           Good