సంగీతానికీ, జీవితానికీ చాలా సారుప్యతలున్నాయి. సంగీతంలోని ప్రతిరాగమూ విశిష్టమైనది, విలక్షణమైనది. జీవితంలోని ప్రతి అనుభవమూ విశిష్టమైనదీ. మానవుడి ఒక్కో అనుభూతినీ, ఉద్వేగాన్నీ ఒక్కోరాగం ప్రతిధ్వనిస్తుంది. అలాగే జీవిత ప్రస్థానంలోని ఒక్కో సంఘటన, ఒక్కో మేలిమలుపు ఒక వినూత్న రాగంతో సమానమైనది.

ప్రేమ, విరహం, నిరాశ, సరసం మొదలైన భావాల సమాహారంగా 'సరిగమలు' రూపొందాయి. జీవితంలో ఇవి కూడా ఉంటాయి. అయితే ఇదే జీవితం కాదు. కుటుంబం, సమాజం, దేశం, ఉద్యోగం, ప్రపంచం కూడా జీవితంలో అంతర్భాగమే.

వీటి ప్రభావాలూ కవిపై ఉంటాయి. ప్రేరణలూ ఉంటాయి. విద్యార్థులకు, సాహితీ మిత్రులకు నేనిచ్చే నిరంతర సందేశం: జీవితంపై ప్రేమ, భవిష్యత్తు పట్ల విశ్వాసం, కుటుంబంపై గౌరవం, సమాజం పట్ల బాధ్యత, దేశంపై భక్తి, ప్రపంచం పట్ల అవగాహన మన జీవన నాదాలు కావాలి.

దేశం, సమాజం పట్ల అవగాహనతోనూ; స్ఫూర్తిదాయకమైన మహనీయుల స్మరణతోనూ రాసిన అభ్యుదయ గీతాల సంపుటి - 'పదనిసలు'. రచయిత భావ పరిణామక్రమాన్ని అర్థం చేసుకోవడానికి ఈ గీతాలు తోడ్పడుతాయి.

ఎస్వీ సత్యనారాయణ

Write a review

Note: HTML is not translated!
Bad           Good