అడిగోపుల వెంకటరత్నమ్‌ కవిత్వం సందేశాత్మకం :

''మాతృ భూమికి చేరువైతే

నీ దేశం నీదే

మాతృ గడ్డకు భారమైతే

నీ దేశం పరాయిదే'' అని నొక్కి వక్కాణిస్తుంది.

''కర్ణకుడి కంటి కన్నీరు

దళారి యింట పన్నీరు...'' కారాదు అంటుంది.

ఆత్మహత్య ఆలోచన క్షణ భంగురం ఉంటుంది. ఇంటి దంష్ట్రాలకు అరచేయి ఆహుతి కారాదు అంటుంది. వర్షలేమికి ప్రధాన కారణం చెట్లు నరకటమే నంటుంది కవిత్వం.

ఈయన కవిత్వం బాధల గాధల్ని ఎత్తుకుంటుంది; హృదయానికి హత్తుకుంటుంది. కథ ఏ రాగం అందుకుంటుందో కవిత కూడ అదే గానం చేస్తుంది... అయితే పాడిందంతా పాట కాదని, రాసిందంతా రచన కాదనే అంతర్వీక్షణం దానికి ఉంది. అందుకే యిలా ముక్తాయింపు పలుకుతుంది కవితా గానం.

''నడిచిన దూరమే గమ్యం కాదు

ఎగరేసిన నాణెమే ఎత్తు కాదు''

పేజీలు : 132

Write a review

Note: HTML is not translated!
Bad           Good