తలపాగకు ఇంగ్లీషు భాషలో వాడే పదమైన టర్బన్‌ అనేది టర్కీ భాష నుండి వస్తే, మెయిడెన్‌ అనే పదం పర్షియన్‌, అలాగే నిత్యమూ మనం ఉపయోగించే గ్యారేజ్‌ అనేది ఫ్రెంచి పదమైతే, మనం త్రాగే టీ చైనా పదం. అలాగే మాస్క్‌ అరబిక్‌, రిక్షో జపనీస్‌ పదం. బ్లిట్జ్‌ అనేది జర్మన్‌, స్ఫుత్నిక్‌ రష్యన్‌ పదం అయితే బ్యాండికూట్‌ మాత్రం, మన తెలుగులోని పందికొక్కు.

ఇలా ప్రపంచంలోని అన్ని భాషలలోని పదాలను కలుపుకొని, ఇంగ్లీషు అంతర్జాతీయ భాష అయింది. భాషలో వెలువడిన ప్రతీ పదానికి ఎంతో కొంత చరిత్ర, దీని వెనుక అప్పటి ప్రజల నమ్మకాలు, భయాలు, ఆశలు, ఆవయాలు - ఇలా ఎన్నో ఉన్నాయి. వాటిలో కొన్ని చరిత్ర కాలగర్భంలో కలిసిపోయినా, మూలాలు లభ్యమైన కొన్ని పదాలను మీ ముందుంచే చిన్న ప్రయత్నమే ఈ 'పదాల వెనుక కథలు'.

పేజీలు : 184

Write a review

Note: HTML is not translated!
Bad           Good