'పడక కుర్చీ కబుర్లు'' 13 (1 నుండి 11 మరియు 13) సంపుటాలు కలిగిన సెట్‌ ...
''సీతారామయ్య గారి మనువరాలులో నాగేశ్వరరావుగారి ప్రతిభ తెలుస్తుంది. 50 ఏళ్ళలో నేర్చుకున్నది అన్‌లెర్న్‌ చేసుకొని ఫ్రెష్‌గా వేయడంతో 231 సినిమాల ద్వారా మనకు తెలిసిన ఆయన మేనరిజమ్స్‌ కనబడక ఆనందాశ్చర్యాలతో ఉబ్బితబ్బిబ్బయ్యాము.''
''ఆ టైములో సంయమనంతో వేసిన పౌరాణికాలు ఫెయిలయ్యాయి. లౌడ్‌గా వేసిన అడివిరాముడు, వేటగాడు, బొబ్బిలిపులి వంటివి సూపర్‌హిట్‌ అయ్యాయి. వీటితోనే రామారావు యంగ్‌ జనరేషన్‌కి చేరువయ్యారు.''
''కత్తుల రత్తయ్య పాత్ర హిట్‌ కావడం కొంపముంచింది. తర్వాత అదే వరుసలో అనేక పాత్రలు. అదృష్టవశాత్తు కెరియర్‌ చివరలో వచ్చిన సంపూర్ణ రామాయణం, పండంటి కాపురం, తాతామనవుడు రంగారావు గారిని మహానటుడుగా మనకు గుర్తుండిపోయేట్లు చేశాయి.''
''రాజుగా వేస్తే రాజుగా, మంత్రిగా వేస్తే మంత్రిగా, సేవకుడిగా వేస్తే సేవకుడిగా ఒప్పించగల సమర్ధుడు. కాబట్టి కూరగాయల్లో గుమ్మడి లాగ నటుడు గుమ్మడి పది కాలాల పాటు మనగలిగారు. ఇలాంటి కబుర్లు ఎన్నో! 

Write a review

Note: HTML is not translated!
Bad           Good