తెలుగులోని మాధుర్యము తెలుసుకొనుటకై ఈ కృషి జరిగినది. ఈ పద సమూహము వినుటకు వీనులవిందుగానుంటుంది. ఈ పదములన్నీ మనకు తెలిసినవే. పదములను ఒక కూర్పులో చేర్చి భాగములుగా విభజించి చదువుటకు వీలుగా తయారు చేశాను. పూసలు దండలో గుచ్చేముందు వివిధ ప్రదేశములలో విసరిపడి వెలుగుతూ ఉంటాయి. ఒక్కొక్క పూస చూడడానికెంతో అందంగా ఉండి కళతో ప్రకాశిస్తుంది. ఆ పూసలను దండలో గుచ్చిన వాటి తళుకెక్కువై ఆ దండ మరింత శోభాయమానంగా కనబడుతుంది.
ఈ పుస్తకములోని భాగములలో పొందుపరిచిన పదములు క్విజ్‌ పోటీలకు ఉపయోగపడతాయి. కొన్ని భాగములలో సులభశైలి పదములు, మరికొన్న భాగములలో హెచ్చుస్ధాయి పదములు కూర్చబడినవి; ఉన్నత పాఠశాల, కళాశాల విద్యార్ధులకు వారివారి పద సంపద (వొకాబులరీ)కు అనుగుణంగా పేర్కొనబడ్డాయి. మొత్తము మీద పుస్తకమంతా చదివిన తర్వాత పదనిధి పెరుగుతుంది. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good