పాచిక' రాజకీయ వ్యాసాలు శీర్షికలో శ్రీ సతీష్ చందర్ గారు ఆంద్ర ప్రభ దినపత్రికకు ప్రధాన సంపాదకునిగా వ్యవహరించిన సమయంలో (2004-2006 మధ్యకాలంలో) ఆదివారం సంచిక కోసం - పాచిక పేరిట సంపాదకీయ వ్యాసం రాసేవారు. ఆ వ్యాసాలు సంకలనమే ఈ పుస్తకం.
ఒక ప్రయాణం ముగిసాక, అంతవరకూ లక్కోచిన భోగీలను వదిలేసి, రైలు ఇంజను వేనుతిరగాతనికి ముఖం మార్చుకుంటుంది. సరిగ్గా అలాగే, కేంద్రంలో ఎన్డియే, రాష్ట్రంలో తెలుగుదేశం - ముఖాలు మార్చుకున్నయి. పలకపక్షలుగా ప్రయాణం ముగించి, ప్రతిపక్షాలుగా యాత్రను మొదలుపెట్టాయి. అక్కడ 'యుపియే', ఇక్కడ 'కాంగ్రెస్'లు వాటి పాత్రల్ని పోషించడం మొదలుపెట్టాయి. తడబట్లు, తట్టరపట్లు, ఆరోపణలు, ప్రత్య్రోపణలు- చట్టసభలు ఈ పక్షాల నేతలు నవరస పోషణ చేసారు.
బుద్ధుడు పుట్టిన జాడల్ని వెతుక్కుంటూ, దలైలామా మనదేశానికి, రాష్ట్రానికి వచేసాడు. అవునూ కదా! బుద్ధుడు ఇక్కడ పుడితే భౌధము, బౌద ప్రవక్తలు వేరే దేశంలో ఉండటం ఏమిటి?
మరోమారు స్త్రీ (సోనియా గాంధీ) భారత ప్రధాన పదవిని అలంకరించే అవకాశం వచినప్పుడు, 'స్వదేసియత' చర్చకోచింది. అల జరిగితే 'గుండు గీయించుకుంట'నని వేరే పార్టీలో ప్రముఖ మహిళా నేత (సుష్మ స్వరాజ్) శపధం చేసారు.
దళితుల మీద అగ్రవర్ణాలు దాడి చేయటం ఎప్పుడు జరిగేదే...! కానీ సాటి దళితులే దళితుల్ని నరికేస్తే... ? నిరుకొండ, కారంచేడు, చుండురులకు భిన్నంగా జరిగిన విషాదం కొత్త ప్రశ్నలు వేసింది.
తండ్రిని కోల్పోయిన అంబానీ సోదరులు తగువులడుకొని వేరుపడితే, భారత్ కార్పోరేట్ సామ్రాజ్యం రెండు ముక్కలుగా చిలికినట్లు భావించింది ప్రపంచం. కానీ తల్లి కోకిలమ్మ సయోధ్య కుదిర్చారు. ఇంతకీ ఇద్దరు రెండుగా చిలర? రెండిన్తలయ్యర?
మాములుగా రాసే సంపదకియలకు భిన్నంగా ఈ 'పాచిక'ల్ని రాయటానికి ప్రయత్నించాను. ఫలించింది...... అంటున్నారు ఈ గ్రంధాన్ని రూపొందించిన శ్రీ సతీష్ చందర్ గారు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good