''అంటే నీ భర్త ఇంకా బతికే వున్నాడని, ఆయనే మహాపూజ చేయాలని అర్ధం. అంతేనా?'' ఒక నిముషం తర్వాత అందరికంటె ముందుగా ఆశ్చర్యం నుంచి తేరుకుని మెల్లిగా అన్నాడు నాయుడు బాబాయ్‌. ఎనభయ్యేళ్ళ వృద్ధుడైనా ఆయన మాటలకు తలూపింది లలితమ్మ.
''పదకొండేళ్ళ క్రితం మాయమైన మనిషి. ఎంత వెతికినా యింతకాలం మనకి కనిపించని నీ భర్త, ఇప్పటికి ఇప్పుడు ఎలా దొరుకుతాడమ్మా? ఎక్కడ వున్నాడో, ఎలా వున్నాడో మనకెలా తెలుస్తుంది? గతంలో ఎన్నిసార్లు అడిగినా పెదవి విప్పని స్వామి ఇప్పుడు ఈ పెటకం పెట్టడం దేనికి?'' కొంచెం స్పీడుగా అడిగాడాయన.
''అదే నాకూ అర్ధం కావటం లేదు. కాళ్ళు పట్టుకుని బతిమాలినా ఎప్పుడూ ఆయన్ని గురించి ఒక్కమాటా మాట్లాడని స్వామి ఇవ్వాళ తనంత తానే వచ్చి నా నెత్తిమీద ఈ బండరాయి పడేసిపోయాడు. సంతోషించి పండగ చేసుకోనా? బాధపడి తలవంచుకోనా?'' అంటూ కన్నీటిని చెంగుతో అడ్డుకున్నది.
''తలకాయ వంచే ఖర్మనీకెందుకు తల్లీ? ఇప్పుడేమైందని తలవంచుకుంటావ్‌? ఉన్నట్లుండి కరకరలాడుతున్న కంఠంతో అడిగాడు రాఘవరెడ్డి.
అతన్ని కంట్రోల్‌ చేయకపోతే, కటువుగా కవ్వించే మాటలు మాట్లాడతాడేమో అన్న అనుమానంతో 'నువ్వు కాసేపు ఆగు రాఘవరెడ్డీ, అమ్మని మాట్లాడనీ అనునయించాడు చిన్నాచారి.
'అమ్మ ఏం మాట్లాడుతుంది? పెద్దయ్య గారు పోయారని చెప్పి, పోయినట్లు సాక్ష్యం కనపించకపోయినా, పూలు బొట్టు తీయించేదాకా నిద్రపోలేదు మన జనం. ఆ పని చేయించిన వాళ్ళనడగాలి ఇప్పుడేం చేయాలో, సమాధానం చెప్పకపోతే బడితతో బాదాలం'టున్న రాఘవరెడ్డి వైపు తిరిగి నవ్వింది లలితమ్మ.
లలితమ్మ భర్త బతికే ఉన్నాడా ? ఉంటే ఇన్నాళ్లూ ఎక్కడ, ఎలా ఉన్నాడు, అలా ఉండటానికి కారణాలేమిటో తెలుసుకోవాలంటే  మధుబాబు రాసిన మిస్టరీ నవల 'పాము' చదవాలి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good