సుప్రసిద్ధ పత్రిక సంపాదకుడు, సినిరచయీత దర్శకుడు చక్రపాణి 1975 లో గతించారు. అప్పటివరకు వారి కృషి విశేషాలపై ఎలాంటి గ్రంధం రాలేదు. చక్రపాణి అతి సన్నిహితులు. హిందీ పండితులు ఈదర లక్ష్మీనారాయణ ప్రేరణతో డాక్టర్ వెలగ వెంకటప్పయ్య చక్రపాణి స్మృతి సంచిక 1995 లో సిద్దం చేసారు. శ్రీ రామా రూరల్ విద్య సంస్దలు, (చిలుమూరు, గుంటూరు జిల్లా) కు చెందినా కొలసాని శ్రీరాములు చొరవ తీసుకోని ఈ గ్రంధాన్ని స్వయంగా ప్రచురించారు. తదుపరి చక్రపాణి - కొలసాని ఫౌండేషన్ ఏర్పడింది . దీని అద్యక్షులు పాటిబండ్ల దక్షిణామూర్తి, ఉపాధ్యక్షులు డాక్టర్ వెలగ వెంకటప్పయ్య , ఆలూరి సుధాకరరావు , కార్యదర్శి కొలసాని మధుసూదనరావు, కోశాధికారి కొలసాని శ్రీరాములు ఎన్నికైనారు . మధుసూదనరావు అనంతరం వారి కుమారుడు తులసి విష్ణు ప్రసాద్ కార్యదర్శిగా సుధకరరావు అనంతరం తిరుపతి రాయుడు పెద్ద కుమారుడు చంద్రశేఖరరావు ఉపద్యక్షులుగా ఎన్నికైనారు .
ఈ సంపుటంలో పల్లీయులు సంగ్రహ నవలతోపాటు పరిణీత (సంగ్రహ నవల), జ్ఞానద (పూర్తి నవల), సవిత (సంగ్రహ నవల), బిందుగారబ్బాయి (సంగ్రహ నవల), రాముని బుద్ధిమంత తనం (పూర్తి నవల) నవలలు వున్నాయి.