చరిత్రాత్మక పరిణామాలలో ఓ ఐ.ఏ.ఎస్‌. అనుభవాలు...గుండె లోతుల్లోంచి...

బాబ్రీ మసీదు కూల్చివేతకు పి.వి. బాధ్యత ఎంత?  అయోధ్య రామాలయం విషయంలో ప్రధానమంత్రి పవి.వి.నరసింహారావు రహస్యంగా సాగించిన మంతనాల కైవారం ఎంత?  వాటిలో ఐఏఎస్‌, ఐపిఎస్‌ అధికారుల పాత్ర ఎంత?

కేంద్రంలో మన్మోహన్‌సింగ్‌ తన పదవికి రాజీనామా చేస్తే ఐఏఎస్‌ అధికారికి ఏం సంబంధం? అయినా తెరవెనకాల నేను ఏం చేస్తే తెర ముందు ఏం జరిగింది?

ఎన్‌.టి.ఆర్‌. చెప్పుడు మాటలు వింటే, ఐఏఎస్‌లు ఎలా బలి కావాల్సివచ్చేది?..ఫరూక్‌ అబ్దుల్లాకి, రాఘవేంద్రస్వామి మఠానికీ ఎన్‌.టి.ఆర్‌. కలిపిన సంబంధం ఎలాంటిది?

రజనీకాంత్‌ని తమిళనాడు ముఖ్యమంత్రిని చేయాలని పి.వి.మనస్ఫూర్తిగా కోరుకున్నారా? ప్రధానమంత్రి పి.వి.ని అడకత్తెరలోకి తోసిన తమిళనాడు రాజకీయశక్తుల చదరంగంలో ఓ ఐఏఎస్‌ అధికారిగా నా పాత్ర ఏమిటి?

ఒక ఐఏఎస్‌ అధికారినైన నా ద్వారా డబ్బు పంపిణీ జరగాలని కోరుకున్న ముఖ్యమంత్రి ఎవరు? ఆ ప్రజాఉద్యమకాలంలో అలా జరగటానికి దారి తీసిన పరిస్థితులేమిటి?

చంద్రస్వామి ఎవరు?  కేంద్ర ప్రభుత్వంలో కొందరు మంత్రులు సాగించిన క్షుద్రపూజల లక్ష్యం ఏమిటి?  ఇలాంటి క్షుద్రరాజకీయాలలో ఒక ఐఏఎస్‌ అధికారిగా నా పాత్ర...??

ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ఇంజనీరింగ్‌ కాలేజిల ఏర్పాటుని మొదట్లో ఎందుకు తీవ్రంగా వ్యతిరేకించారు?  రాజకీయాలకీ, పరిపాలనకీ మధ్య అగాధమెంత?

అవినీతిని అంతమొందించడానికి నిపుణుల సాయంతో తయారుచేసిన సమగ్ర ప్రణాళికని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎందుకు అటకెక్కించేశారు?

1992లోనే వై.యస్‌.రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాల్సివున్నా, నేను కూడా సూచించినా, అప్పటి పార్టీ అధ్యక్షుడుగా పి.వి.నరసింహారావు ఎందుకు ఆమోదించలేదు?

అమితాబ్‌ బచ్చన్‌, అంబానీలు నన్నే వెతుక్కుంటూ ఎందుకువచ్చారు?  ఢిల్లీ రాజకీయాల్లో వ్యాపారవేత్తల పాత్ర ఎలాంటిది?

...ఇలా సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తే అనేక కీలక పరిణామాలలో ఒక పాత్రధారిగా లేదా ఒక మౌనసాక్షిగా తాను నిర్వహించాల్సి వచ్చిన పాత్ర గురించి రిటైర్డ్‌ ఐ.ఏ.ఎస్‌. అధికారి పి.వి.ఆర్‌.కె.ప్రసాద్‌ 'స్వాతి' వార పత్రికలో రాసిన యథార్థగాథల సంకలనం ఈ 'అసలేం జరిగిందంటే...'

Write a review

Note: HTML is not translated!
Bad           Good