పి.సత్యవతి కథలు

సత్యవతి కథల్లో అనసవరమైన పాత్రలు, సంఘటనలు, వర్ణనలు వుండవు. శైలీ వ్యామోహంగానీ, వర్ణనా చాలప్యం గానీ ఆమెకు లేవు. ఒకటి రెండు చోట్ల తళుక్కుమన్నా అది హద్దులు దాటలేదు. సత్యవతి శైలిలో భావం (సెన్స్‌), భావోద్రేకం (ఫీలింగ్‌), కంఠస్వరం (టోన్‌), ఉద్దేశం (ఇన్‌టెన్షన్‌) స్పష్టంగా వుండవలసిన మోతాదులో వుంటాయి. అందులో కవిత్వం బరువుకాని, భాష బరువుకాని, వాక్య నిర్మాణపు బరువుకాని వుండవు.

సత్యవతి కథలు 'నిశ్చల నిశ్చితాలను' ఆదర్శీకరించవు. కుహనా ఆదర్శాలాను ప్రతిపాదించవు. సమాజ పరిణామశీలతను తిరస్కరించవు. జీవిత సమస్యను పరిణామం నుంచి వేరు చేసి చూడవు. స్త్రీ కళ్ళలోకి చూడగల సాహసంలేక మనం తప్పించుకు తిరుగుతున్న ప్రశ్నల్ని ఈ కథలు మనం నడుస్తున్న బాటలో నాటుతాయి. ఆ ప్రశ్నలు మనల్ని ముందుకు అడుగువేయనీయవు. మనల్ని చూసి వ్యంగ్యంగా నవ్వుతాయి. మనలోని రెండు విభిన్న వ్యక్తిత్వాల మధ్య, మన ఆత్మవంచన పరవంచనల మధ్య నిటారుగా నిలబడి మన కళ్ళలోకి చూస్తూ నవ్వుతాయి. మనల్ని సుఖంగా ఉండనివ్వక అల్లరి పెట్టే ప్రశల్ని అడిగే సత్యవతి కథలు గొప్పవి కాక మరేమౌతాయి. - వల్లంపాటి వెంకటసుబ్బయ్య

Write a review

Note: HTML is not translated!
Bad           Good