యద్యదాచరతి శ్రేష్ఠ: తత్తదేవేతరో జన:

న యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే

దేనినైతే శ్రేష్ఠులైన వారు ఆచరిస్తారో దాన్ని సామాన్యులు అనుసరిస్తారు. శ్రేష్ఠులు నెలకొల్పిన ప్రమాణాలను అంతా పాటిస్తారు. - ఆచరణ ద్వారా అలాంటి శ్రేష్ఠులైన వారి గురించి చెప్పే పుస్తకం ఇది. ఓ చిన్న సద్గుణమే, ఇతరులకి చేసే ఓ చిన్న సహాయమే జీరోలని హీరోలుగా మారుస్తుంది. అందువల్ల నిస్వార్ధంగా ప్రవర్తించినవారి వార్తలకు దినపత్రికలు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇంటర్‌నెట్‌లోని అనేక వెబ్‌సైట్ల నుంచి అనేక సంవత్సరాలుగా శ్రీ మల్లాది వెంకట కృష్ణమూర్తి గారు వెదికి సేకరించిన, అనేక మంది మనుషుల దయతో కూడిన నిస్వార్ధ చర్యలను ఈ పుస్తకంలో చదవొచ్చు. మనం కూడా అలా దయగల వ్యక్తిగా మారడానికి ఇది ప్రేరణని ఇస్తుంది. చిన్న అగ్ని కణంలా రాజుకునే ఆ ప్రేరణ మనలో ఔన్నత్యాన్ని నెలకొల్పి, మనల్ని ఉన్నతులుగా తీర్చిదిద్దగలదు.
మనసుకి వేదన కలిగినప్పుడు ఈ పుస్తకాన్ని చదవండి. ప్రతి పేజీలో మీరు కలిసే, నిస్వార్ధతకి దర్పణంలా నిలిచే అనేకమందిలోని దయ, కారుణ్యం, ప్రేమ మొదలైన అనుకూల భావాలు మీకు తప్పక సాంత్వనని ఇవ్వగలవు. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good