షట్కర్మ క్రియలనేవి శాస్త్రీయమైనవి. ఇవి మనలోని త్రిదోషాలలోని అసమతౌల్యాన్ని సరిచేసి సమతౌల్యాన్ని పెంపొందిస్తాయి. శరీరంలోని మలినాలు తొలగించి శరీరాన్ని శుద్ధి చేస్తాయి.
ముద్రలనేవి చేతి వ్రేళ్ళను ఉపయోగిస్తూ చేసే ఒక రకమైన సంజ్ఞలలాంటివి. ఇవి మన మనస్తత్వంలో, ప్రవర్తనలో, దృష్టిలో మార్పు తీసుకొనివచ్చి మనలో జాగరూకతను, ఏకాగ్రతను పెంపొందిస్తాయి. ముద్రలలో ఒక్కోసారి శరీరం మొత్తాన్ని ఉపయోగిస్తూ చేసేవి ఉంటాయి లేదా కేవలం చేతులతో మాత్రమే చేసేవి ఉంటాయి.
వివాహ బంధంలో ఒత్తిడి లేని జీవితాన్ని ఆస్వాదించాలంటే ప్రేమను పంచాలే కాని ఆశించకూడదు. ఎప్పుడూ హృదయంతో ఉండాలి. ఇద్దరూ ఒకరి ఆనందం కొరకు మరొకరు పాటుపడాలి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good