ఉన్నట్టుండి ''మాధవీ!'' అన్న పిలుపు విన్పించింది. ఉలిక్కిపడి తల తిప్పేటంతలో ఉయ్యాల కదలసాగింది. ఎవరో బలంగా ఊపుతున్నట్లు విసురుగా ఊగుతోంది. బ్యాలెన్స్‌ తప్పిపోకుండా ఉయ్యాల గొలుసుని గట్టిగా పట్టుకుని తలతిప్పి చూసింది. - రాజా!

''మాధవీ ఇక నువ్వు దాగుడుమూతలాడలేవు. ఇంటి బయట తాళం పెట్టి లోపలే వుండి ఎక్కడికో వెళ్ళినట్లు బుకాయించలేవు. ఇంక నా కళ్ళు కప్పలేవు మాధవీ!''

ఉయ్యాల ఊగుతోంది...ఆమె కళ్ళు తిరుగుతున్నాయి. ''ఊగు మాధవీ ఊగూ!...ఇన్నాళ్ళు నా జీవితంలో ఆటలాడినందుకు, నీ జీవితాన్నే ఉయ్యాలగా చేసుకున్నందుకు కసిగా ఊగు''! గొలుసుని పట్టుకున్న వేళ్ళు పట్టు తప్పుతున్నాయి. శక్తినంతా కూడదీసుకుని వ్రేళ్ళు స్వాధీనం తప్పకుండా గట్టిగా పట్టుకుని కూర్చుంది మాధవి.

కళ్ళముందు చీకట్లు- ఉయ్యాల ఊగుతుంది...

ఆ చీకట్లో కదిలే నీడలు- ఉయ్యాల ఊగుతుంది...

ఆ నీడల్లోంచి ఏవేవో దృశ్యాలు-ఉయ్యాల ఊగుతుంది..

తెగిన ప్రేమ పటం మాలతీ మాధవం

ఊగవే ఉయ్యాల!

చదవండి! చదివించండి!!

Write a review

Note: HTML is not translated!
Bad           Good