జాతీయ స్ధాయిలో అత్యధికంగా అమ్ముడయిన నవల ఫైవ్ పాయింట్ సమ్వన్కు బహుమతి పొందిన రచయిత శ్రీ చేతన్ భగత్ రాసిన మరో సమకాలీన ఇంగ్లీషు నవల వన్ నైట్ ఏ ద కాల్ సెంటర్కు తెలుగు అనువాదమిది. అనువాదకర్త ఆర్.శాంత సుందరి.
2004 చలికాలంలో ఒక రాత్రి రైలు ప్రయాణంలో ఒక రచయిత ఒక అమ్మాయిని కలుసుకుంటాడు. కాలక్షేపానికి ఆమె అతనికి ఒక కథ చెప్తానంటుంది. కాని, దానికో షరతు పెడుతుంది. అతను దానిని తన రెండో పుస్తకంగా రాయాలి. అతను వెనకాడతాడు. అయినా నా కథ దేని గురించి అని అడుగుతాడు. ఆ కథ కాల్ సెంటర్లో పనిచేస్తున్న ఆరుగురు వ్యక్తుల గురించి అని, అది ఒక రాత్రి జరుగుతుందని ఆ అమ్మాయి చెబుతుంది. అదే రాత్రి వాళ్ళకొక ఫోన్ కాల్ వస్తుందని ఆమె అంటుంది. ఆ ఫోన్ కాల్ వచ్చింది దేవుడి దగ్గరనుంచి. కాల్ తీసుకోవడానికి మీరు రెడీయేనా?
నిర్ధుష్టమైన గురి, సునిశితమైన రచయిత చూపు అతి చిన్న వివరాలనీ, సూక్ష్మమైన తేడాలని చక్కగా పట్టుకుంది. వన్ నైట్ ఎట్ ద కాల్ సెంటర్ భారతదేశంలోని యువతీ యువకులని ఆకట్టుకుంది. దీనిలో రాజకీయాలకన్నా కథా చిత్రణకి, ఆదేశం కన్నా సమస్యానిర్ధారణకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటమే దానికి కారణం. వన్ నైట్ ఎట్ ద కాల్ సెంటర్ ఇంగ్లండు, అమెరికా దేశౄలలో ప్రచురించబడింది. ఫ్రెంచి, ఇటాలియన్, డచ్, రష్యన్ భాషల్లోకి అనువదించబడింది. అంతర్జాతీయంగా విజయం సాధించింది.