ఇప్పటివరకూ తనే సంపాదకురాలిగా, అనువాదకురాలిగా, విమర్శకురాలిగా, ఎందరో గొప్ప రచయితలను మనకు అందించిన ఓల్గా గురించి తోటి రచయితలు, విమర్శకులు అందించిన ఈ వ్యాసాలు పాఠకాదరణ పొందుతాయని ఆశిస్తున్నాను. తన జీవిత పర్యంతం, స్త్రీల కోసం రాస్తూ, పని చేస్తూ, స్త్రీలకు ఏక కాలంలో ధైర్యాన్నీ, ఊరటనూ కల్పిస్తూ, వారికి పథనిర్దేశనం చేస్తున్న ఓల్గాకు తెలుగు రచయితలు అందిస్తున్న ఒక పుష్పగుచ్ఛం ఈ గ్రంథం. ఇందులోని పూలు కేవలం సుగంధాన్ని అందించడానికే కాదు కఠోరవాస్తవాలను మృదువుగా, మధురంగా చెప్పడానికి ఉద్దేశించినవి. ఆమె సృజనలతో జీవితాలను, ఆలోచనలు తాజా చేసుకోవడమే ఈ పుష్పగుచ్ఛం లక్ష్యం. - డాక్టర్‌ || సి.మృణాళిని
మహిళల స్వేచ్ఛ, హక్కుల గురించి సామాన్యులకు అవగాహన కల్పించిన రచయితల్లో అగ్రస్థానం ఓల్గాదే. ఆమె రచనలు అనేక పునర్ముద్రణలు పొందటం, అసంఖ్యాక పాఠకులు ఆమెను ఆరాధించడం, పరిమిత సంఖ్య పాఠకులు ఆమెను దుమ్మెత్తిపోయడం - ఇవన్నీ ఆమె విప్లవాత్మక ఆలోచనా సరళికి, ఆమెలోని కాలిక స్పృహకు నిదర్శనాలు. ఆమె రచనల పట్ల కొందరిలో కలిగిన ఆగ్రహమే, వ్యవస్థీకృతమైపోయిన నమ్మకాలు, నిజాలను ఆమె సున్నితంగా ప్రశ్నిస్తున్నదనటానికి బలమైన సాక్ష్యం. ఆమెలోని ఇంకో ప్రత్యేకత - ఆమె ఎప్పుడూ నోరుపెట్టుకుని అరవదు అతి నెమ్మదిగా, సుతిమెత్తగా ఆమె సంధించే ప్రశ్నలు మనకు విషయాన్ని జీర్ణించుకున్న తర్వాతే పూర్తిగా అర్థమవుతాయి. ఒక ప్రవక్తకున్నంత ఉత్సాహంతో ఆమె అసృష్టమైన భావాలను, సిద్ధాంతాలను కూడా సామాన్య పాఠకుడికి అవగతమయ్యేలా రాస్తుంది. - వసంత కన్నబిరాన్‌

Write a review

Note: HTML is not translated!
Bad           Good