రచయిత గురించి... రాహుల్‌ సాంకృత్యాయన్‌ అంతర్జాతీయ విఖ్యాతి పొందిన పాళీ, సంస్క ృత భాషా పండితుడు. గొప్ప చరిత్రకారుడు, కార్యశూరుడు, సుమారు 10 సం||లు సుదీర్ఘ కాలాన్ని స్వాతంత్య్ర యోధులుగా కారాగారాల్లో గడిపిన త్యాగమూర్తి. లెనిన్‌గ్రాడ్‌ విశ్వవిద్యాలయంలో ప్రాచ్యభాషా బోధకుడుగా పనిచేసి ఖ్యాతినొందిన సుప్రసిద్ధ భారతీయుడు. హిందూ సన్యాసిగను, ఆర్యసమాజకునిగను, అంతర్జాతీయ ఖ్యాతి గడించిన బౌద్ధబిక్షువుగను ఈయన పేరు పొందారు. వీరు చేసిన భాషాసేవకు కాశీ పండితులు వీరిని ''మహాపండిత్‌'' బిరుదుతో గౌరవించారు. బౌద్ధవేదముల మూడింటిలోను ఈయన నిధి. అందువల్ల బౌద్ధ విజ్ఞానులు ఈయనకు ''త్రిపీఠకాచార్య'' బిరుదునిచ్చారు. రాహుల్‌జీ సాగించిన పరిశోధనలు భారత సంస్క ృతిని 600 సం||లు చరిత్రలో సుసంపన్నం చేశాయి. వీరి రచనలు హిందీ భాషకు 400 సం||ల చరిత్రను చేర్చాయి. వాటిలో హెచ్చువాటిని జైళ్ళలోను లేక నేపాల్‌, టిబెట్‌, సిలోన్‌లలో రచించారు. వివిధ భాషాలలో వీరి గ్రంథాలు 60కి పైగా వుంటాయి. తెలుగు పాఠకులకు సుపరిచితమైన ''ఓల్గా నుంచి గంగకు'' రచనను 1941 సం||లో నిర్బంధవాసంలో రాశారు.
రాహుల్‌జీ రచనలలో సుప్రసిద్ధమైనవి కొన్ని....
1) ఋగ్వేద ఆర్యులు, 2) సింహసేనాపతి, 3) విస్మృత యాత్రికుడు, 4) దివోదాసు, 5) లోకసంచారి, 6) జయయౌధేయ.,, 7) మధురస్వప్నం, 8) ఓల్గా నుంచి గంగకు

Write a review

Note: HTML is not translated!
Bad           Good