వరప్రసాది శ్రీ రంగారావు

నటన చదివితే తెలిసేది కాదు, నేర్చుకుంటే వచ్చేది కాదు. అది వరప్రసాదం. తన నిజ స్వరూపాన్ని మరుగుపరచి, ఎన్నుకున్న పాత్ర మనస్తత్వాన్ని ఆకళించుకుని, అందులో లీనమై, హావ, భావముల ద్వారా, ఆంగిక, అభినయాల ద్వారా పాత్రను సజీవంగా రూపకల్నన చేయగలిగినపుడే నటుడు కృతకృత్యుడౌతాడు. అది అందరికీ సాధ్యమయ్యేది కాదు, అందరూ చెయ్యగలిగిందీ కాదు. పూర్వజన్మ సుకృతం వల్ల ఆ అవకాశం కొందరికే లభిస్తుంది. అలా లభించిన అవకాశమును కృషిచేసి సద్వినియోగపర్చుకోగల వారు కూడా కొద్దిమందే! ఆ కొద్దిమందిలో శ్రీ యస్‌.వి.రంగారావు గారు ఒకరు.

వారు ఫైర్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న రోజుల్లో ఇంత మహానటుడు అవుతారని ఎవరూ ఊహించి ఉండరు. వారిలో దాగివున్న కళాపిపాసే ఆ ఉద్యోగానికి కూడా రాజీనామా ఇప్పించింది. ఆ తదుపరి చిత్రరంగంలో ప్రవేశించారు. నాతోపాటు ఆనాడు వారు 'పల్లెటూరి పిల్ల' చిత్రంలో చిన్నపాత్రను నటించినప్పుడే అనుకున్నాను, అన్నాను కూడా! ''ఈ పరిశ్రమలో అగ్రశ్రేణి నటులలో మీరూ ఒకరనిపించుకునే రోజు తప్పక వస్తుంది సోదరా!'' అని. నాటినుంచీ అకుంఠిత దీక్షతో కృషిసల్పి, ''సున్నపురంగడు' (షాపు కారు), ''నేపాళ మాంత్రికుడు'' (పాతాళ భైరవి), ''మాలి'' (చంద్రహారం), ''వియ్యన్న'' (పెళ్లి చేసి చూడు), ''కోటయ్య'' (బంగారుపాప), ''ఘటోత్కచుడు'' (మాయా బజార్‌), ''కీచకుడు'' (నర్తనశాల) వంటి వాటికి రూపకల్పనలు చేసి తద్వారా ప్రజల హృదయాలలో, పరిశ్రమలో ఉన్నత స్థానాన్ని సంపాదించుకున్న కళాతపస్వి. అది ఆంధ్రులకే గర్వకారణం.

- శ్రీ ఎన్‌.టి.రామారావు

Pages : 256

Write a review

Note: HTML is not translated!
Bad           Good