ఏ జీవికైనా జననం.. మరణం రెండూ యాదృచ్ఛిక ఘటనలే. ఐతే మనిషికి జనన సందర్భంలోనూ, మరణ స్థితిలోనూ స్పృహ..సోయి.. ఉండవు. జ్ఞాపకాలు లుప్తమై మనసంతా ఒట్టి ఖాళీసీసాలా మిగిలి ఉన్నట్టుండే అంకుర స్థితినుండి ఎదిగి ఎదిగి... ఒంటరితనం నుండి ఒక సమూహమై, ఒక బృంద జీవనానికి అలవాటుపడ్తూనే మెల్లమెల్లగా తనను తాను, తన పరిసరాలను తాను... తన లక్ష్యాలను తాను, తెలుసుకుంటూ సంఘర్షిస్తూ, జీవితాంతం ఒక సుదీర్ఘ యాత్రను కొనసాగిస్తూనే..నడచి వచ్చీ వచ్చీ... అంతిమంగా సంధ్యాతీరంపై నిలబడి... తలెత్తి శూన్యాకాశంలోకి చూస్తూ ఒంటరిగా నిలబడ్డప్పుడు,

జననమంటే..యిదివరకు లేని ఒక జీవవ్యవస్థ కొత్తగా రూపుదాల్చడమేనా.?

మరణమంటే... జీవన యాత్రను యిక ముగించి నిష్క్రమించడమేనా.?

లేక, మనిషి భౌతికంగా కనుమరుగైపోయినా.. సమాజపరంగా ఒక జ్ఞాపకంగా.. ఒక చరిత్రగా మానవజాతి ఉన్నతికోసం మిగిలిపోయిన ఒక స్మృతిగా గుర్తుండిపోవడమేనా.. అన్న మీమాంసలో..

ఈ నవల.

- రామా చంద్రమౌళి

Pages : 85

Write a review

Note: HTML is not translated!
Bad           Good