అహం కేంద్రక భావన నుండి మనస్తత్వశాస్త్రాన్ని విముక్తం చేశాడు సిగ్మండ్‌ ఫ్రాయిడ్‌. చేతనావస్థలో ఒక వ్యక్తిలో కలిగే ఆలోచనలు, భావోద్వేగాలు అతని ప్రవర్తననూ, ఆచరణను నిర్దేశిస్తాయని మనస్తత్వవేత్తలు భావించేవారు. ఒక వ్యక్తి మనస్సునూ, ప్రవర్తననూ అర్థం చేసుకోవాలంటే చేతనావస్థలో ఆ వ్యక్తి మానసిక వ్యక్తీకరణలను, ఆలోచనా విధానాన్ని విశ్లేషించాలని భావించేవారు. అయితే, మనోవిశ్లేషణ పద్ధతి ద్వారా ఫ్రాయిడ్‌ ఆవిష్కరించిన మనస్తత్వమే అచేతన భావన.

మనస్సులో కామవాంఛలతో సతమతమయ్యే వ్యక్తి ఆ కోరికల ఉదాత్తీకరణ ద్వారా పరమభక్తునిగా పూజాపునస్కారాలలో సదా మునిగి తేలవచ్చు! తననుతాను అల్పునిగా చేతగాని వానిగా భావించే వ్యక్తి ఇతరులపై పెత్తనం చెలాయించవచ్చు! మన మానసిక స్వరూపాన్ని ఫ్రాయిడ్‌ ఒక మంచు ఖండంగా అభివర్ణించాడు.

చిన్నతనం నుండి కుటుంబసభ్యులతో సంబంధాల ప్రభావం, లైంగిక ఉద్దీపనలు, సమాజం మనపై విధించిన విధి, నిషేధాలు మన సహజాత ప్రవృత్తులను అణచివేసి అచేతనలోకి నెట్టివేస్తాయి. ఇలా అణచివేయబడిన భావాలే పరోక్షంగా వ్యక్తి ప్రవర్తనను నిర్దేశిస్తాయని ఫ్రాయిడ్‌ మనోవిశ్లేషణ పద్ధతి ద్వారా నిరూపించాడు.

మనోవిశ్లేషణ పద్ధతి ద్వారా మతవిశ్వాసాలపై ఫ్రాయిడ్‌ చేసిన అధ్యయనమే ''ఒకానొక భ్రమ భవిష్యత్తు'' అనే ఈ పుస్తకం. ఈ పుస్తకంలో మరో విషయాన్ని కూడా స్పష్టం చేశాడు ఫ్రాయిడ్‌. కేవలం క్రిష్టియన్‌ మతాన్ని మాత్రమే (ఇస్లాంను కూడా కలుపుకోవాలి ఎందుకంటే క్రిష్టియన్‌, ఇస్లాం మతాల మూలాలు ఒక్కటే) అధ్యయనం చేశానన్నాడు.

పేజీలు : 64

Write a review

Note: HTML is not translated!
Bad           Good