పరమహంస యోగానంద స్వీయ చరిత్ర
''గంగాధరబాబు అనే శిష్యుడు ఒకడు మంచి నైపుణ్యంగల ఫోటోగ్రాఫరు. ఫోటో తియ్యబోతే మాయమై పోయే (లాహిరి) మహాశయుల రూపం తన కేమెరాను తప్పించుకు పోజాలదని దంభాలు పలికాడు. గురుదేవులు పద్మాసనం వేసుకొని ఒక కొయ్యబల్ల మీద కూర్చుని వున్నారు. ఆయన వెనకాల ఒక తెర వేలాడుతోంది. అప్పుడతను తాను తలపెట్టిన పని నెరవేరడానికి అన్ని జాగ్రత్తలూ తీసుకుని, ఆబగా పన్నెడు ఫోటోలు తీశాడు. అయినా తరువాత చూస్తే ప్రతి ప్లేటు మీదా కనిపించేదేమిటీ? కొయ్యబల్లా, వెనకాల తెరానూ; అంటే మహాశయుల ఆకారం మాత్రం ఆయిపు లేదు. గంగాధరబాబుకి కళ్ళ వెంట నీళ్ళు వచ్చేశాయి. గర్వం పటాపంచలయింది....''

ఇట్లాంటి ఎన్నో అద్భుత కథనాలను, అనుభవాలనూ లిపిబద్ధం చేశారు పరమహంస యోగానంద. ఆధ్యాత్మలోకాన సుప్రసిద్ధ గ్రంధమైన ఆటో బయోగ్రఫీ ఆఫ్‌ ఎ యోగికి యిది తెలుగు సేత. ఈ గ్రంధం ఇప్పటికి 21 భాషల్లోకి అనుదితమయింది. పరమహంస యోగానంద (1893-1952) ఉత్తేజకర ''స్వీయ చరిత్ర'' యిది. యోగానందులవారి గవేషాణా యిందులో అక్షరబద్ధమైంది, పరమయోగులనూ జీవన్ముక్తులనూ గురించి విన్నవీ కననవీ మనకు అందిస్తారు యోగానంద. రమణ మహర్షి, ఆనందమయి మాత, మహాత్మాగాంధీ, రవీంర్దనాథ్‌ టాగోర్‌, జగదీశ్‌ చంద్రబోస్‌ ప్రభృత్తులతో యోగానంద సమాగమ విశేషాలు కూడా ఇందులో ఉన్నాయి. సాధకులకు ఇది కరదీపిక వంటింది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good