అసలు, 'ఏ ఉత్పత్తి కైనా 'ధర' ఎందుకు, దేన్ని బట్టి, ఏర్పడుతుంది? కొన్ని ఉత్పత్తులకు తక్కువ ధరా, కొన్ని ఉత్పత్తులకు ఎక్కువ ధరా, ఎందుకు ఉంటాయి? - ఈ రకంగా, 'ధరని' గురించిన కారణం తెలుసుకోవాలనే ఆసక్తితో, వేల సంవత్సరాల నించీ ఉత్సాహవంతులు, ఆలోచిస్తూనే వున్నారు. ఈ పరిశోధన, అరిస్టాటిల్‌తో ప్రారంభమై, 2 వేల సంవత్సరాలు గడిచే నాటికి, రికార్డో దగ్గరికి వచ్చేటప్పటికి, ఒక చిన్న విషయం దొరికింది. అదేమిటంటే, 'ఏ ఉత్పత్తి అయినా శ్రమ తోటే తయారవుతుంది; ఆ శ్రమల వల్ల తయారైన ఉత్పత్తిలో కొంత భాగం, పెట్టుబడి పెట్టిన వాడికి లాభంగా అందాల్సిందే' - ఇదే రికార్డో అన్నది!

'మార్క్సు' అరిస్టాటిల్‌ నించీ మొదలు పెట్టి, రికార్డో దాకా, ఆర్థిక విషయాల గురించి ఎవరేం చెప్పారో, అన్నీ చదివాడు. ఈ పరిశోధనలో, మార్క్సు తెలివికి, అసలు రహస్యం అందింది. ఆ రహస్యం ఏమిటంటే: వస్తువుకి 'ధర' దేని వల్ల? ఒక వస్తువుకి ధర 120 అయితే, ఆ 'ధర' అంతా పూర్తిగా 'శ్రమ కాలం' వల్ల ఏర్పడేదే అవుతుంది. అంతేగానీ, శ్రమతోటి తయారు కాని ఏ విషయమూ, వస్తువు తయారీకి కారణం అవదు.

'కౌలూ', 'వడ్డీ', 'లాభం' అనేవి, ఉత్పత్తి తయారీకి ఏ శ్రమలనూ ఇవ్వవు. అసలు అవి ఏ శ్రమల తోటీ తయారైనవి కావు. అవి, మోసపు పేర్లు. ఆ పేర్ల ద్వారా డబ్బుని పొందే వాళ్ళు ఆ ఆదాయాలతో బోలెడు ఉత్పత్తుల్ని మోసంగా సంపాదిస్తూ వుంటారన్నమాట! వాళ్ళు వాడే ఏ ఉత్పత్తులూ, వాళ్ళ శ్రమలతో తయారయ్యేవి కావు. శ్రమల వల్ల తయారు కాని వడ్డీలూ, లాభాలూ వంటివి, సరుకు ధరని ఏర్పరిచే 'శ్రమ కొలత'కి ఎలా కారణం అవుతాయి? ... మార్క్సు అవగాహన ఈ తర్కాలతో సాగింది.

పేజీలు : 204

Write a review

Note: HTML is not translated!
Bad           Good