తెలుగు కథ పుట్టి అంతర్జాతీయ స్థాయికి చేరుకోవడానికి సరిగ్గా నలభై రెండేళ్ళు పట్టింది. క్రమక్రమంగా ఎదుగుతూ వచ్చిన ఈ ప్రక్రియ విస్తృతంగా వ్యాపించింది. కవిత్వానికి కూడా లేని పాఠక ప్రపంచాన్ని సృష్టించుకుంది. ఎంతో మంది రచయితల చేతుల్లో మ¬న్నత శిఖరాలకు చేరింది. సామాజిక వేగాన్ని కూడా పుంజుకోవడం ఈ తరం తెలుగు కథ ప్రత్యేకత! ఈ సంలకనంలో ముప్పయారు కథలున్నాయి. కథపై ఆయా రచయితలు వెలిబుచ్చిన అభిప్రాయాలు ఉన్నాయి. కళను విస్మరించకుండానే సామాజికి దృక్పథాన్ని ప్రస్ఫూటం చేసే ఆవేదన, జీవితపు లోతుల్ని చిత్రించగలిగే ఆర్థ్రతగల ఈ కథలు, ఒక్కోచోట పరిష్కార చైతన్యాన్ని కూడా అందించగలిగాయి. సమకాలీన తెలుగు రచయితల రచనా ప్రతిభకు సూచిక, సాహిత్య అకాడెమీ ప్రచురించిన ఈ మూడవ తెలుగు కథామాలిక!

Write a review

Note: HTML is not translated!
Bad           Good