Rs.150.00
Out Of Stock
-
+
1947 నాటి చరిత్రాత్మక వీర తెలంగాణ ప్రేమ కథ 'ఒక నజియా కోసం'.
అరవై ఏళ్ళ తర్వాత ఒక ఉత్తరం తిరిగొచ్చింది.
మా తాత తన ప్రేయసి నజియాకు రాసింది.
అది చూసి ఆయన గుండె వేగం పెరిగింది.
హాస్పిటల్ బెడ్ మీద కొన ఊపిరితో ఆమెను కలవరిస్తున్నారు.
ఎవరీ నజియా?
ప్రేమించుకున్నారు...ఎందుకు పెళ్లి చేసుకోలేకపోయారు?
తాత వస్తానని ఉత్తరం రాసి..ఎందుకు వెళ్లలేదు?
నిజాం ఎవరు?
ఆయన్ని తాత ఎందుకు చంపాలనుకున్నాడు?
మరి నజియా ఏమైపోయింది?
నేనిప్పుడు గుచ్చుకుంటున్న ఈ ప్రశ్నల కత్తులు
గుండె ఒరలో పెట్టుకుని... ముంబై నుంచి హైదరాబాద్
బయలుదేరుతున్నాను. నా ప్రయాణం సమాధానాల కోసం,
తాత కోసం మాత్రమే కాదు... నాకు తెలియని
చరిత్రాత్మక నా తెలంగాణ మూలాల కోసం కూడా..
ఈ కార్తీక్ రామస్వామి అన్వేషణ ఒక నజియా కోసం..