మనిషిని మనిషి నమ్మలేని ఈ రోజుల్లో - దేవరాజులు హెన్ద్రీని నమ్మి తన ఇంటికి తీసుకొచ్చాక అతడితోటి స్నేహం వృద్ధి కావటం ఎంతో సహజత్వాన్ని సంతరించుకుంది. ఎన్నో సంవత్సరాల నుండి అనుభవిస్తున్న ఆస్తిని, ఆకస్మికంగా ఊడిపడ్డ అన్నయ్య 'పెంపుడు కొడుకు' అన్న ఒకే కారణంచేత దొరైకణ్ణు, తన యావదాస్తినీ అతనికి ఇచ్చివేయటం పల్లెవాసుల స్వచ్ఛమైన మనస్తత్త్వానికి ఒక నిలువుటద్దంలా భాసిస్తుంది. కానీ తనను పెంచిన తడ్రి ఆస్తిని తిరిగీ పినతండ్రికే ఇచ్చివేస్తూ, తన తండ్రికి వారసుడిగా తనను గుర్తిస్తే, తను ఉండటానికి ఒక్క ఇల్లు చాలనీ చెప్పిన హెన్రీ పాత్ర అద్భుతమనిపిస్తుంది.
హెన్రీ, దొరైకణ్ణు, దేవరాజులు, అక్కమ్మ, మనసబు ఇలా ప్రతిపాత్రా చక్కటి వ్యక్తిత్వాన్ని కలిగి ప్రేమాభిమానాన్ని పంచేవిగా ఉండటం ఆరోగ్యకరమైన అంశం. పాత్రలన్నింటి మధ్యా అతర్లీనంగా అనుబంధాలు పెనవేసుకున్న తీరు ఎంతో విశిష్టతను సంతరించి పెట్టింది. సహజమైన గ్రామీణ నేపథ్యాన్నీ, ఔన్నత్యాన్నీ మన కళ్ళ ముందు ఆవిష్కరించిన నవల ఇది. పల్లెసీమల మట్టివాసనను పట్టి మన దోసిలిలో పోసిన అపురూపమైన నవల ఇది. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good