"నాకు తెలిసినంతవరకు జంతువులు ఆత్మహత్య చేసుకోనలేవు. ఎందుకంటే, అవి ఆలోచించలేవు. ఆలోచించగల అద్భుతమైన శక్తిగలమనిషి అప్పుడప్పుడు సరిగా ఆలోచించలేక, తన సమస్యలపై సరియైన నిర్ణయం తీసుకోనలేక, ఆత్మహత్య వైపు మ్రొగ్గు చూపుతాడు. చాలామంది యువకులు, స్కిజోఫ్రీనియాతోనో లేక డిప్రెషన్ తోనో, బలహీన మనుస్కులై ఆత్మహత్యలవైపు పురికోల్పబడతారు. ఆత్మహత్యా ప్రయత్నం చేయుటకు ముందు వీరంతా తీవ్రమైన మానసిక వేదనను అనుభవించి, డిప్రెషన్ కులోనై, వారి సమస్యకు పరిష్కారమేలేదని, చావు తప్ప వేరే గత్యంతరం లేదని భావిస్తారు. ఆశ్చర్యకరంగా, చావునుండి బయటపడిన తర్వాత వీరంతా చాలా సంతోషిస్తారు. కనుక పరిష్కారమే లేదనుకున్న వీరి సమస్యలన్ని కేవలం ఊహాజనితమైనవేనని ఋజువగుచున్నది. కేవలం ఆ సమయంలో వారు సరిగా ఆలోచించ లేకపోవుట వలన, వారు అటువంటి నిర్ణయం తీసుకున్నారే తప్ప, మరి ఇంకేమికాదు. కనుక ఈ యువకులందరికి నేను ఇచ్చే సలహా ఒక్కటే! తమ మనసు ఆత్మహత్యలవైపు మ్రొగ్గు చూపినయెడల, తొందరపడక, ఈ విషయము తమకు ఇష్టమైన, ముఖ్యమైన వారికి తెలియజేసి, తమ తల్లిదండ్రులను, తను ప్రేమించే ఇతరులను గుర్తుచేసుకొని, ఆ ఆలోచననుండి బయటపడవలెను. ఇంకా, వెంటనే ఒక మానసిక వైద్యున్ని సప్రదించుట మంచిది. ఈ ప్రపంచము చాలా అందమైనది మరియు అద్భుతమైనది. నీ ఈ జన్మ చాలా విలువైనది. కనుక, ఎన్ని కష్టాలు వచ్చినను కడవరకు జీవించి ఉండవలెను. ఈ జన్మ ఇంకోసారి రాదు."---- సూర్య

Write a review

Note: HTML is not translated!
Bad           Good