తెలుగు సాహిత్యాకాశంలో ఓ 'మహా విస్ఫోటనం'
మహాకవి శ్రీశ్రీ జీవితం. తెలుగు సాహిత్యంలో అతను ప్రవేశ పెట్టిన వినూత్న ప్రయోగాలు, కావ్యలోకంలో నెలకొల్పిన విప్లవాత్మక ప్రమాణాలు యావత్ విద్వత్ లోకాన్నీ అపూర్వస్థాయిలో ప్రభావితం చేశాయి. అసలు, శ్రీశ్రీ జననమే ఒక మహా 'అణు విస్ఫోటనం'! అలాంటి మహాకవి గురించి విద్వన్మణి పత్తి సుమతి, శ్రీశ్రీని, ఆయన కవిత్వాన్ని పలుకోణాల నుంచి అధ్యయనం చేసి రాసిన కొన్ని అర్తవంతమైన వ్యాసాలు హృద్యంగా ఉన్నాయి. శ్రీశ్రీకి గురుదేవుడు గురజాడ. ఆ గురజాడ పేరిటనే ఒక అధ్యయన వేదిక స్థాపించి, దానికి అధ్యక్షురాలిగా ఉన్న శ్రీమతి సుమతి 12 అధ్యాయాలలో మహాకవి సార్వ జనీనమూర్తిని తనదైన శైలిలో, ఈ పుస్తకంలో ఆవిష్కరించింది. శ్రీశ్రీ జీవిత సందేశం అనంతం, కవితా స్ఫూర్తి అనంతం, ఆయన సందేశం అనంతం, ఆయన మూర్తిత్వంపైన శోధన, పరిశోధన అనంతం. ఎన్ని కోణాల నుంచైనా శ్రీశ్రీని అధ్యయనం చేయవచ్చు.... - డా|| ఎ.బి.కె.ప్రసాద్
పేజీలు : 80