ప్రపంచ బ్యాంక్‌ వంటి అంతర్జాతీయ ద్రవ్య సంస్థలు పేద దేశాల అవసరాలు పెంచి, కొత్త అవసరాలు సృష్టించి, ఆ అవసరాలు తీర్చుకునేందుకు ఇబ్బడి ముబ్బడిగా అప్పులు ఇచ్చే కుట్ర, బహుళజాతి కంపెనీల ప్రయోజనాలు నెరవేర్చేందుకు ఉద్దేశించిన ఓ అంతర్జాతీయ కుట్ర ఇప్పుడు బట్టబయలైంది. 'ఎకనామిక్‌ హిట్‌మాన్‌' అనే ఆర్థిక దళారీలను నియమించి, అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రభుత్వాధినేతలను ప్రలోభపెట్టి, ఆ దేశాలను అమెరికన్‌ సామ్రాజ్యవాదానికి బంట్లుటా మార్చేసిన ఈ కుట్ర గుట్టు విప్పారు జాన్‌ పెర్కిన్స్‌, స్వయంగా ఎకనామిక్‌ హిట్‌మాన్‌గా పనిచేసి ఇప్పుడు చేతికంటిన సామాన్యుల రక్తాన్ని పశ్చాత్తాపంతో కడుక్కోవాలనుకుంటున్న పెర్కిన్స్‌ అంతరంగ కథనమే ఈ సంచలనాత్మకమైన పుస్తకం.


మొదట పంచరంగుల అప్పుల వలలు


అటుపై నిరాఘాట సహజ వనరుల దోపిడీలు


మాట వినకుంటే సిఐఏ తోడేళ్ల గురగురలు


దారికి రాకుంటే విచక్షణారహిత బాంబుదాడులు


అర్థ శతాబ్దం దాటిన అగ్రరాజ్యం అరాచకాలు

Write a review

Note: HTML is not translated!
Bad           Good