'పోరాటం లేకపోతే ప్రగతి లేదు. దున్నకుండానే పంట కోరుకొనేవారు ఉద్యమం లేకుండా స్వేచ్ఛ కోరుకొంటార. ఉరుములూ మెరుపులూ లేని వానల్ని కోరుకొనేదీ వారే.'' - ఫ్రెడరిక్‌ డగ్లస్‌

సుమారు 190 ఏళ్ళ క్రితం పుట్టిన ఒక బానిస ఆత్మకథ ఇది. అతని పేరు ఫ్రెడరిక్‌ డగ్లస్‌. ఆయన తన ఆత్మకథలో తాను బానిసగా బతికిన రోజుల్ని కళ్ళకు కట్టినట్లు చిత్రించాడు. మేరీల్యాండ్‌ నుంచి న్యూయార్కుకి ఎలా పారిపోయి వచ్చిందీ వివరించడు. అమెరికాలో బానిసత్వాన్ని నిషేధించాలనే ఉద్యమానికి ఆయన క్రమంగా గొప్ప నాయకుడయ్యాడు. ఆయన ఒక వక్తగా, రచయితగా, నాయకునిగా, మేధావిగా ఎలా రూపొందిందీ మనకు ఈ పుస్తకం తెలియజేస్తుంది. దళితుల మేథాశక్తి గురించి చులకన భావం ఉన్నవారికి అంబేద్కర్‌ జీవితం ఎలా సమాధానం చెప్పిందో, నల్ల బానిసల జ్ఞానం గురించి ఎగతాళి చేసిన బానిస యజమానుల కూతలకు డగ్లస్‌ జీవితం అటువంటి తిరుగులేని జవాబు ఇచ్చింది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good