ఇది మహాత్మాగాంధీ గురించి మహాకవి శ్రీశ్రీ రచనల సకలం. సంకలనం. స్వాతంత్య్రానికి ముందు 1946 నుండి భౌతికంగా దూరమయేదాకా 1983 వరకు. ఇందులో గాంధీపై, గాంధీయిజంపై శ్రీశ్రీ నివాళులూ, నిరసనలూ, పరామర్శలూ, శరామర్శలూ, కామెంట్సూ, కాంప్లిమెంట్సూ అన్నీ ఉన్నాయి. ఎన్నో ఉన్నాయి. కవితలుగా..కథలుగా...నాటికలుగా...వ్యాసాలుగా... వార్తలకు వ్యాఖ్యలుగా..ఉత్తరాలుగా..అనువాదాలుగా...ఇంటర్వూ&్యలుగా..ఇష్టాగోష్ఠులుగా..పాఠకుల ప్రశ్నలకు జవాబులుగా..సినిమా పాటలుగా.. వివిధ ప్రక్రియలలో ఉన్న సాహిత్య, సామాజిక, రాజకీయ సమాచారాన్ని పాఠకుల సౌకర్యార్థం రాసిన / అచ్చయిన తేదీల వారిగా పొందుపరిచాము. ఇంకా మహాత్ముడిపై శ్రీశ్రీ రచనల మీద కొందరి ప్రముఖుల అభిప్రాయాలు పొందుపరుస్తున్నాం.
పేజీలు : 63