ఒడిసీ కథానాయకుడు ఒడిసియస్. ట్రాయ్ యుద్ధం పదేళ్ళపాటు జరిగింది. యుద్ధం అయిపోయాక అతడు ఇంటికి తిరిగి రావడానికి మళ్ళీ పదేళ్ళు పట్టింది. మధ్యలో ఎన్నో అవాంతరాలు. ఎన్నో ప్రమాదాలు. అందుకే ఒడిసీ అనే పదం కష్టాలతో కూడిన సుదీర్ఘ ప్రయాణానికి ఒక సంకేతగా మారిపోయింది.
'ఒడిసీ'ని బీనాదేవిగారు తనదైన శైలిలో ఆడుతూ పాడుతూ చెప్పార. ఒక పక్క హోమర్ని పలకరిస్తూ మరో పక్క పాఠకుడికి కబుర్లు చెబుతూ మధ్య మధ్య చెణుకులు విసురుతూ కథ చెప్పారు. మూలకథ గ్రీకుచైనా కథనం తెలుగు నుడికారంతో సాగుతుంది. పూర్తిగా ఆధునికంగా తేట తెలుగులో అక్కడక్కడా ఇంగ్లీషు పదాలతో అలవోకగా సాగిపోతుంది.