ఒద్దిరాజు సోదరుల బహుముఖీన వైదుష్యం

''వరంగల్‌ జిల్లాలోని ఇనుగుర్తి గ్రామ వాస్తవ్యులైన ఒద్దిరాజు సీతారామచంద్రరావు, రాఘవరంగారావు గారలు ''ఒద్దిరాజు సోదరులు''గా విఖ్యాతులు. సంగీత సాహిత్యములనేగాక సమస్త శాస్త్రములను స్వయం కృషితో సాధించిన ఘనులు. బహుభాషాకోవిదులు. ఇద్దరూ కలిసీ, విడివిడిగానూ అనేక నవలలు, నాటకాలు, కావ్యములు, కథలు, వ్యాసములు, సంప్రదాయ గ్రంథములు, శాస్త్ర గ్రంథములు, విజ్ఞాన గ్రంథములు, సంస్కృత రచనలు, ఆంగ్ల కవిత్వమూ రచించారు. రామరాజుగారన్నట్లు చౌర్యము తప్ప చతుషష్టి కళలు ఈ సోదరులకలవడినవి. ఈ శతాబ్ది ప్రారంభంలో తెలంగాణాలో నెలకొని వున్న పరిస్థితుల నేపథ్యంలో ఈ సోదరుల కృషి ప్రధానమైందేకాదు, ప్రశంసనీయము కూడా. 1922 నుండి 28 వరకు వీరు నడిపిన 'తెనుగు పత్రిక' సాహిత్య, సాంస్కృతిక, సామాజిక చైతన్యానికి ఎంతో దోహదం చేసింది''.

పేజీలు :54

Write a review

Note: HTML is not translated!
Bad           Good