భారత కమ్యూనిస్టు ఉద్యమ ఆద్యుల్లో ఒకరు ముజఫర్ అహ్మద్. ఉద్యమంలో ఆయన తొలి సంవత్సరాల (1913-29) అనుభవాలను వివరిస్తుంది ఈ పుస్తకం. భారత కమ్యూనిస్టు ఉద్యమ ఆవిర్భావం అభివృద్ధి పట్ల ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరు చదవదగినది ఈ ప్రచురణ. కమ్యూనిస్టు ఉద్యమ తొలిరోజుల్లో నేతలు, కార్యకర్తలు ఎదుర్కొన్న కష్టనష్టాలను, వారి త్యాగాలను అర్ధం చేసుకోవడానికి, వారి నుండి నేటి తరం కమ్యూనిస్టులు స్ఫూర్తి పొందడానికి ఉపయోగపడేది ఈ పుస్తకం.
సుచేతన చటోపాధ్యాయ, జాదవ్పూర్ విశ్వ విద్యాలయం కలకత్తాలో చరిత్ర అధ్యాపకురాలు. జాదవ్పూర్ విశ్వవిద్యాలయంలోను, స్కూల్ ఆఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్, లండన్ విశ్వ విద్యాలయంలోను ఆమె విద్యనభ్యసించారు. సౌత్ ఏషియా రీసెర్చ్ అండ్ హిస్టరీ వర్క్షాప్ జర్నల్లో ఆమె పలు వ్యాసాలను ప్రచురించారు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good