విదేశీ కథా సాహిత్యం నుండి మహిళళు రాసిన కథలను తెలుగు పాఠకులకు అందించే అనువాద కథల సంపుటికి 'ఓ నగరం కథ' శీర్షిక ఔచిత్యంగా ఉంది.

రష్యన్‌, స్వీడిష్‌, ఉక్రేయిన్‌, వియత్నాం, జపనీస్‌, లెబనాన్‌, పోలిష్‌, అమెరికన్‌, ఇంగ్లీషు భాషా కథానువాదాలు ఇందులో ఉన్నాయి. పలు భాషల్లో ప్రావిణ్యతగల రచయిత ఈ అనువాద ప్రక్రియలో ఆంగ్లం, హిందీ, కన్నడ భాషలను అనుసంధాన భాషలుగా ఉపయోగించుకోవడానికి అదనపు సౌకర్యంగా జతకూడింది.

మూలభాషలోని రచయిత్రులు - కథ, నవల, జర్నలిజం, నాటకం, అధ్యాపకత్వం వంటి వివిధ రంగాల్లో, ప్రక్రియల్లో నిష్ణాతులు, ప్రఖ్యాతులు. వీరిలో కొందరు నోబెల్‌ బహుమతి గ్రహీతలున్నారు. స్త్రీవాదులుగా, హృదయవాదులుగా రచనను వేదికగా చేసుకొని 1907 నుంచీ ఆలోచనాత్మక సృజనలు చేసినవారున్నారు. ఇందులోని ఒక్కో రచయిత్రిదీ ఒక్కో విభిన్నశైలీ విన్యాసం, విన్నాణం.

ఆర్ద్రత నిండిన అతివల (కొందరు పురుషుల) అంతరంగ చిత్రణీ 'ఓ నగరం కథ'. కారుణ్యం నిండిన కథనాలను ఎంపిక చేసుకోవడం అనువాదకుని కరుణాంతరంగానికి ప్రతీక.

Write a review

Note: HTML is not translated!
Bad           Good