ఈ పుస్తకం ప్రధానంగా ఆధ్యాత్మిక ప్రగతిని కాంక్షించే సాధకులను వుద్ధేశించబడింది. ధర్మాచరణ లేకపోతే ఎంత సాధన చసినా చిల్లుకుండని నీటితో నింపటమే అవుతుంది. మన సనాతన ధర్మం ప్రతి మనిషి ధర్మబద్ధంగా జీవించాలని బోధించింది. కాని నేటి పరిస్ధితులు అధర్మంగా ఉండటానికి ప్రేరణ ఇస్తూ వుండడంతో, ధర్మంగా వుండాల్సిన ఆవశ్యకతను గుర్తు చేయడమే ఓ మంచి మాట ఉద్ధేశం. ఆంధ్రజ్యోతి దినపత్రిక శుక్రవారం నివేదిక పేజీల్లో వెలువడిన ఈ మంచి మాటలు- 'సుశ్లోక దర్శిని'గా కూడా ఉపయోగించే ఈ పుస్తకం మిమ్మల్నందరినీ ఆకట్టుకుంటుందని, ఆద్యాత్మికంగా మరింత ఉన్నత స్ధితికి తీసుకెళ్ళడానికి ఆ పరమాత్మ సహాయం మనందరికీ లభిస్తుందని ఆశిస్తూ - 

Write a review

Note: HTML is not translated!
Bad           Good